Sunday, May 12, 2019

IPL T20 12th Final Winner Mumbai Indians

   4th Time Winner Mumbai Indians 

ఆహా..! ఏం ఫైనల్‌ ఇది! నరాలు తెగే ఉత్కంఠ! బంతి బంతికీ గుండె వేగం మరింత పెరిగింది. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. చివరి వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌దే విజయమేమో అనిపించింది. కానీ బుమ్రా వచ్చిన ప్రతిసారీ మ్యాచ్‌ను ముంబయి వైపు మలుపుతిప్పాడు. ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా విసిరి మలింగ తన అనుభం ఏంటో చాటిచెప్పాడు. చివరికి ముంబయి ఇండియన్స్‌ ‘మహాసేన’ ఐపీఎల్‌ 12 విజేతగా ఆవిర్భవించింది. పటిష్ఠ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై పరుగు తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. రోహిత్‌ బౌలర్లను అత్యంత వ్యూహాత్మకంగా వినియోగించి తానెంత విలువైన సారథో మరోసారి అందరికీ నిరూపించాడు. ఈ సీజన్‌లో చెన్నైపై ముంబయికిది మూడో విజయం కావడం గమనార్హం.

Tags Ipl t20 cricket mi vs csk final match 

No comments:

Post a Comment