Saturday, April 20, 2019

IPL T20 CRICKET MI vs RR AND DC vs KXIP

                         MI vs RR 


రాజస్థాన్‌ సత్తా చాటింది స్టీవ్‌ స్మిత్‌ (59 నాటౌట్‌; 48 బంతుల్లో 5×4, 1×6) తొలిసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన వేళ రాయల్స్‌ శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులే చేసింది. డికాక్‌ (65; 47 బంతుల్లో 6×4, 2×6) టాప్‌ స్కోరర్‌. స్మిత్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (43; 29 బంతుల్లో 5×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడడంతో రాయల్స్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.10 మ్యాచ్ ల్లో 4మ్యాచ్ ఓడిపోయి 12పాయింట్లు సాధించింది. 

DC vs KXIP 
బౌలర్లు సందీప్‌ లమిచానె (3/40), కాగిసో రబాడ (2/23), అక్షర్‌ పటేల్‌ (2/22).. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ (56; 41 బంతుల్లో 7×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటడంతో ఐపీఎల్‌-12లో దిల్లీ మరో విజయం సాధించింది. ఆ జట్టు 5 వికెట్ల తేడాతో  పంజాబ్‌పై నెగ్గింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (69; 37 బంతుల్లో 6×4, 5×6) మెరుపులు మెరిపించినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌కు దిల్లీ బౌలర్లు కళ్లెం వేశారు. అనంతరం దిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది
ఢిల్లీ 10మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయి 12పాయింట్లు సాధించింది .
Tags:   IPL T20 CRICKET  MI KXIP 
RR RCB SRH DC CSK KKR 


Telugu Cinema Box Office Collection

        మూడు చిత్రాలు బాక్స్ ఆఫీసు దగ్గర                                ఘనవిజయాలు 


సమంతా నాగచైతన్య పెళ్లైన తరువాత మొదటి సారి కలిసి నటించిన చిత్రం మజిలీ.                                               శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 5నరిలీజ్ అయి మంచి విజయం అందుకుని వసూళ్లు పరంగా నాగచైతన్య కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ప్రేమలో ఫెయిలయిన పాత్రలో నాగచైతన్య క్రికెట్ ర్ గా నటించారు .భర్త ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే పాత్రలో సమంతా నటించారు .విరి నటనకు మంచి విజయం దక్కింది .మంచి కథ కథనం రొమాంటిక్ లవ్ స్టోరీని దర్శకుడు కొత్తగా చూపించారు. 
ఎన్నాళ్ళకొ విజయం దక్కింది సాయిధరమ్ తేజ్ కు.
పిల్ల నువ్వు లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలతో మంచి విజయం అందుకుని ఆతర్వాత వరుసగా ప్లాపులతో ఉన్న సాయిధరమ్ తేజ్ ఈ చిత్రలహరి మంచి విజయం సాధించింది .జీవితం ఫెయిలయిన యువకుడీ పాత్రలో సాయి మంచి నటన కనబరచాడు .కిషోర్ తిరుమల దర్శకత్వం కళ్యాణి ప్రియదర్శిన్ నిలేదా పేతురాజ్ హిరోయిన్ల్ గా నటించారు మ్యూజిిిక్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది .
నాని కూడా జీవితంలో ఫెయిలయిన క్రికెటర్ పాత్రలో ఒదిగిపోయి భావోద్వేగాలు సమంగా పండిచారు నాని శ్రద్ధా శ్రీనాద్ సత్యరాజ్ నటనకు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. కెరీర్ లో ఓడిపోయిన వ్యక్తి కుమారుడు అడిగింది ఇవ్వలేక సతమతమవుతూ భార్య సంపాదనపైనే బతుకుతు చివరికి తన కుమారుడు కోసం మళ్లీ జీవితాన్ని ఎలా ప్రారంభించారు అనుకున్నది ఎలా సాధించాడు ఆన్న నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు .సినిమాకి మంచి టాక్ అందుకుంది. నాని పలికించిన భావోద్వేగాలు సినిమాకే హైలైట్ . ఈ మూడు చిత్రాలు కామన్ లైన్ ఒక్కటే జీవితంలో ఓడి గెలవడం .



Tags:  MAJILI  CHITRLAHARI   JERSEY  NANI  SHRADDA SRINADH   SAMATHA  NAGACHITANYA  SAI DHRAM TEJA 


                          


FAST AND FURIOUS 9 HOBBS AND SHAW TRAILER

       FAST AND FURIOUS 9 TRAILER 

Dwayne Johnson Super Action Movie 
Trailer Click Here 

Tags : FAST AND FURIOUS 9 HOBBS AND SHAW  DWAYNE JOHNSON JASON  ACTION THRILLER  HOLLYWOOD MOVIE 

Bharat Motion Poster Salman Khan

               Bharat Motion Poster 

Bharat Motion Poster Salman Khan 5 Looks 
1964 to 2010 5 looks background music is super .Salman young to old getup is excellent makeup.5th June Eid Time Release Motion Poster video Click Here .

Tags:  BHARAT  SALMAN KHAN  KATRINA KAIF  ABBAS ALI JAFER  BOLLYWOOD MOVIE 

Friday, April 19, 2019

RCB vs KKR IPL T20 CRICKET

           ఉత్కంఠభరితమైన పోరులో

               బెంగుళూరు విజయం 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి కోల్‌కతా ముందు భారీ టార్గెట్‌ నిర్దేశించింది. కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ(100, 58 బంతుల్లో 9x4, 4x6) శతకంతో అదరగొట్టగా మొయిన్‌ అలీ(66, 28 బంతుల్లో 5x4, 6x6) అర్ధశతకంతో చెలరేగాడు. మొదట పార్థివ్‌పటేల్‌(11), అక్ష్‌దీప్‌నాథ్‌ (13) తక్కువ పరుగులకే ఔటైనా కోహ్లీ, అలీ మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించి స్కోర్‌ బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అలీ ఔటయ్యాక కోహ్లీ దూకుడుగా ఆడి శతకం సాధించాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు తెరపడింది    

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 24 పరుగులు అవసరం కాగా అప్పటికే భీకర ఫామ్‌లో ఉన్న రసెల్‌(65, 25 బంతుల్లో 2x4, 9x6) బెంగళూరుకు వణుకు పుట్టించాడు. చివరి ఓవర్‌ వేసిన మొయిన్‌ అలీ కేవలం 13 పరుగులే ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. మొదటి ఓవర్‌ నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆపై నితీశ్‌రాణా(85, 46 బంతుల్లో 9x4, 5x6), రాబిన్‌ ఉతప్ప కాసేపు పోరాడినా విజయం వైపు సాగలేదు. దీంతో ఉతప్ప ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రసెల్‌ కోల్‌కతాను గెలిపించినంత పని చేశాడు. చివరి ఓవర్‌లో మొయిన్‌అలీ కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరుకు విజయాన్ని అందించాడు
Tags   IPL T20 CRICKET KKR  RCB 

Ayogya Official Trailer Tamil Vishal

        AYOGYA OFFICIAL TRAILER 

Vishal Raasi Khanna Prathiepen 
Director Venkat Prabu
Music Sam CS
Tags :  AYOGYA OFFICIAL TRAILER  VISHAL 
RAASI KHANNA  

Kanchana 3 Movie Review Raghava Lawrence

                   కాంచన 3 మూవీ రివ్యూ 
లారెన్స్ ఎంచుకునే దెయ్యం క‌థ‌ల‌న్నీ ఒకే ఫార్ములాలో సాగుతుంటాయి. క‌థానాయ‌కుడ్ని ఓ దెయ్యం ఆవ‌హించ‌డం, ఆ దెయ్యంతో స‌మ‌స్యలు, దాని వెనక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండ‌టం.. త‌న ప‌గ తీర్చుకోవ‌డానికి క‌థానాయకుడి శ‌రీరాన్ని ఆస‌రాగా చేసుకోవ‌డం..ఇదే క‌థ‌. ‘కాంచ‌న 3’లోనూ అదే జ‌రిగింది. గత దెయ్యం సినిమాల స్క్రీన్ ప్లే, నేప‌థ్య సంగీతంతో స‌హా.. చాలా విష‌యాల్లో పోలిక‌లు క‌నిపిస్తుంటాయి. కాక‌పోతే.. ఈసారి రాఘవను ఆవ‌హించిన దెయ్యం ఒక‌టి కాదు. రెండు. ఆ రెండు దెయ్యాల‌కూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కాళి జీవితాన్ని స‌ర్వనాశ‌నం చేసిన‌ వాళ్లని దెయ్యం రూపంలో రాఘవను అడ్డుపెట్టుకుని ఎలా ప‌గ తీర్చుకున్నాడో చూపించి క‌థ‌ని ముగించారు.
బంగ్లాలోకి దెయ్యం రావ‌డం, ఆ దెయ్యాన్ని చూసి అంతా భ‌య‌ప‌డ‌డం, ఆ దెయ్యం.. బంగ్లాలో ఉన్నవాళ్లంద‌రితోనూ ఆడుకోవ‌డం... ఇదంతా అక్కడక్కడా న‌వ్విస్తుంది. రాఘవ స్వత‌హాగా డ్యాన్సర్‌ కాబ‌ట్టి, మంచి డాన్స్ మూమెంట్స్ ఉన్న పాట‌లను ప్రేక్షకులు కోరుకోవ‌డం స‌హ‌జం. ఆ లెక్కల‌తోనే పాట‌ల‌న్నీ సాగాయి. ఆ పాట‌ల్లో రాఘవ డాన్స్ మూమెంట్స్ ఆక‌ట్టుకుంటాయి. సినిమాలో అర‌వై స‌న్నివేశాలుంటే అందులో స‌గానికి పైగా మాస్‌ని ల‌క్ష్యంగా చేసి రాసుకున్నవే. కామెడీ కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంది. ఇంకొన్ని చోట్ల న‌వ్విస్తుంది.
ద్వితీయార్ధంలో కాళి ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాల‌తో సాగిపోతుంది. కాళి చేసే మంచి ప‌నులు, సేవా కార్యక్రమాలు.. వీటితో ఫ్లాష్ బ్యాక్ నిండిపోతుంది. రాఘవ తీసిన గత క‌థ‌ల్లానే.. ఈ సినిమానీ ముగించాడు. క‌థ‌, క‌థ‌నాల్లో కొత్తద‌నం లేక‌పోవ‌డం, కామెడీ అక్కడక్కడా శ్రుతిమించ‌డం.. ‘కాంచ‌న 3’కి కాస్త ప్రతికూలంగా మారాయి. మాస్‌ని మెప్పించే అంశాలూ ఉండ‌డం క‌లిసొచ్చే విష‌యం.
రాఘ‌వ (రాఘవ లారెన్స్‌)కి దెయ్యాలంటే భ‌యం. ప‌డుకునేట‌ప్పుడు కూడా మంచం చుట్టూ చెప్పులు, నిమ్మకాయ‌లు పెట్టుకుంటాడు. రాఘ‌వ త‌న కుటుంబంతో క‌లిసి తాత‌య్య ఊరికి వెళ‌తాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన‌ప్పటి నుంచీ చిత్ర విచిత్రాలు జ‌రుగుతుంటాయి. అర్ధరాత్రి అరుపులు, కేక‌లు వినిపిస్తుంటాయి. ఎవ‌రో అటూ, ఇటూ ప‌రుగులు పెడుతున్నట్లు క‌నిపిస్తుంటుంది. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ‌ని అఘోరాలు కూడా చెప్తారు. ఆ దెయ్యం రాఘ‌వ‌ని కూడా ఆవ‌హిస్తుంది. ఆ దెయ్యం పేరే... కాళి. మ‌రి కాళి ఎవ‌రు? రాఘ‌వ‌ని ఎందుకు ఆవ‌హించింది? కాళి ల‌క్ష్యం ఏమిటి? అనేది తెలియాలంటే ‘కాంచ‌న 3’ చూడాల్సిందే

Tags: KANCHANA MOVIE REVIEW  RAGHAVA LAWRENCE TELUGU 

Jershi Movie Review Nani Shradda Srinadh

                       జెర్షి మూవీ రివ్యూ

నాని శ్రద్ధా శ్రీనాద్ సత్యరాజ్ బ్రహ్మజి సుబ్బారాజు సంపత్ రాజ్ 
సంగీతం       అనిరుధ్ రవిచందర్  
సినిమాటోగ్రఫీ      సాను నర్గిష్ 
కూర్పు         నవిన్ నూలి 
నిర్మాత        సూర్య దేవర నాగవంశి 
దర్శకత్వం     గౌతమ్ తిన్ననూరి 

  నిర్మాణం     సితార ఎంటర్టెయిన్మెంట్ 
నాని క్రికెటర్ పాత్రలో 1980 నాటి నేపథ్యం కావడం సినిమా పై అంచనాలు పెరిగాయి. ఎలా ఉందో చూద్దాం. 
అర్జున్  (నాని) క్రికెటర్ సారా(శ్రద్ధా శ్రీనాధ్ )ఇద్దరూ ప్రేమించు కుని పేళ్లి చేసుకుంటారు.అర్జున్ ఎంత బాగా ఆడిన జాతీయ జట్టులో స్ధానం రాకపోవడంతో 26ఏళ్ల వయసులో క్రికెట్ కు దూరం అవుతాడు .తరువాత స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ కూడా పోతుంది .సారా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూంటుంది.అర్జున్ కొడుకు నాని తన పుట్టిన రోజున గిఫ్ట్ గా జేర్షి యిమ్మని అడుగుతారు .ఐదోందల జేర్షి కోసం అర్జున్ చేయని ప్రయత్నమంటు ఉండదు .ఇదే సమయంలో అర్జున్ సారా మద్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి .తన కొడుకు అడిగిన జెర్షి కోసం కొడుకు అనందం కొసం కసితో చివరికి తాను వదెలిసిన క్రికెట్ ఆడటం తిరిగి మొదలు పెడతాడు. అర్జున్ కొడుకు కొసం ఎమి చేసారో సారా మధ్య గొడవలు ఎలా పరిష్కారం అయింది మిగతాది.
36ల వయసులో క్రికెట్ ఆడటం జాతీయ జట్టు లో స్థానం కోసం ప్రయత్నం సఫలమైందా క్రికెట్ జీవితంలో ఫెయిలయిన అర్జున్ కథ ఇది .

నేచురల్ స్టార్ గా అభిమానులకి నాని ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతారు .హిరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ పాత్రలో ఒదిగిపోయారు .కొచ్ పాత్రలో సత్యరాజ్ అందరూ తమ పాత్రలో బాగాకనెక్ట్ అయి నటించారు .అనిరుధ్ సంగీతం సినిమాటోగ్రఫీ నిర్మాణం అంతా బాగున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ బాగా హెండిల్ చేశారు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సిన్ సినిమాకు  బాగా హైలైట్ సాను నర్గిష్ సినిమాటోగ్రఫీ పడ్డ కష్టం తెరపై చూడాల్సిందే.

Tags:  JERSHI  MOVIE  REVIEW  NANI  SHRADDA SRINADH  TELUGU 

Thursday, April 18, 2019

IPL T20 CRICKET MUMBAI INDIANS

                ముంబాయికి చిక్కిన ఢిల్లీ 
ముుంబాయి ఢిల్లీ మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో ముుంబాయి ఖాతాలో మరో విజయం .ఢిల్లీ పై 40 పరుగులు  తేడాతో గెలిచింది .ప్లేఆఫ్ ఆశలు నిలుపుకొంది .

TAGS :  IPL T20 CRICKET MUMBAI INDIANS  DELHI CAPITALS 

Urmila Comment PM Modi Movie


                  మోడి పై కామెడీ సినిమాలన్నా ఊర్మిళ 

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్‌ను ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు ఊర్మిళా మతోండ్కర్‌ తప్పుపట్టారు. ఆయనేం సాధించారని బయోపిక్‌ తీశారంటూ ప్రశ్నించారు. ఆయనపై బయోపిక్‌ కంటే ఒక కామెడీ సినిమా తీస్తే సరిగ్గా సరిపోతుందని విమర్శలు గుప్పించారు. ఆ సినిమాలో 56 అంగుళాల ఛాతీ ఉన్న ఒక వ్యక్తిని దేశానికి ప్రధానిని చేసినా ఏమీ చేయలోకపోయారనే సన్నివేశాల్ని చూపించాలని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారాల్లో ఎన్నో హామీలు గుప్పించి తీరా ప్రధాని అయ్యాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన విధానాన్ని చూపించాలన్నారు.
మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’పై పెను దుమారమే రేగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీని విడుదలను నిలిపివేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..  ఇందుకు నిరాకరించింది. అయితే ఆ తర్వాత అనేక అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం మరోసారి సుప్రీంకు చేరడంతో ఎన్నికల అధికారులు సినిమాను వీక్షించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇటీవల అధికారులు సినిమాను వీక్షించారు. దీనిపై ఈసీ నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఊర్మిళ ముంబయి నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరగనుంది
Tags: URMILA  MUMBAI  ELECTION INDIA  PM MODI  CONGRESS  BJP 

The Jawaani Video Song Student Of The Year 2

              Student Of The Year 2

                 The Jawaani Video Song 
The Jawaani Video Song 
Tiger Shroff  Ananya Tara 
Excellent Moment Dance Music 
Background Seen Is Very Good. Watch this video song Click
Tags:  STUDENT OF THE YEAR 2 HINDI MOVIE  TIGER SHROFF 
VIDEO SONG  THE JAWAANI  


Wednesday, April 17, 2019

Actor Prabhas Instagram First Post

            ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ మొదటి పోస్ట్ 

 
ఎట్టకేలకు ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ నుంచి మొదటి పోస్ట్ చేశారు .పేట్టిన కోన్ని గంటలకు రెండు లక్షలకుపైగా లైక్ రావడం విశేషం .పాలోవర్ల సంఖ్య 8లక్షలు దాటడం .మొదటి పొస్టు బాహూబలి చిత్రంలొనిది కావడం మరో విశేషం. 







Tags:   PRABHAS   INSTAGRAM   TELUGU MOVIE 

Tamilnadu Elections Voting Stars

               Tamilnadu Elections 



సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, ఆయన కుమార్తె శ్రుతి హాసన్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని ఆల్వార్‌పేటలో క్యూలో నిలుచుని ఓటేశారు.
తమిళ సినీ నటులు అజిత్‌, ఆయన భార్య షాలిని, మరో సినీ నటుడు విజయ్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు



Tags:  TAMILNADU   ELECTIONS  VOTING   SUPER STAR'S 

చేన్నై పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం IPL T20 CRICKET

        సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం 

పెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (50; 25 బంతుల్లో 10×4), జానీ బెయిర్‌స్టో (61 నాటౌట్‌; 44 బంతుల్లో 3×4, 3×6) అర్ధ సెంచరీలతో చెలరేగిన వేళ.. సన్‌రైజర్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. ధోని లేని చెన్నై జట్టుకి సన్‌రైజర్స్‌ బౌలర్లు సమర్థంగా అడ్డుకట్ట వేశారు. అనంతరం సన్‌రైజర్స్‌ మరో 19 బంతులు మిగిలివుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో చెన్నైకిది రెండో ఓటమి మాత్రమే

Chiranjeevi Latest News

      రాజకీయాలను పక్కన పెట్టెసిన చిరంజీవి 



పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నాగబాబు ఎం పి గా పోటీ చేసిన మెగా స్టార్ తమ్ముళ్ళ కోసం  ఒక్క సారి కూడా ప్రచారం చేయలేదు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయలేదు .పూర్తిగా రాజకీయాలు దూరం పేట్టినట్టు తెలుస్తోంది. తనకు నచ్చిన సినిమా హిరోగానే నటించనున్నారు. 







Tags:  CHIRANJEEVI   POLITICS  AP POLITICAL  JANASENA  
  F35  అదృశ్యమైపోయింది
ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ ఉదయం సాధనలో భాగంగా జపాన్‌లోని మిసవా బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరిన విమానం ఎఫ్‌35ఏ అరగంటలోపే రాడార్‌ నుంచి అదృశ్యమైపోయింది. దీంతో విమానం పసిఫిక్‌ సముద్రంలో కూలిపోయినట్లు జపాన్‌ అధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో ఒక్కసారిగా అమెరికా, జపాన్‌లు అప్రమత్తమైపోయాయి. ఈ విమానం జపాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలోని జలాల్లోనే కూలిపోయినట్లు అనుమానించారు. కొద్ది గంటల్లోనే విమాన శకలాలను గుర్తించామని జపాన్‌ సైన్యం ప్రకటించినా కీలక భాగాలు మాత్రం ఇంకా వారి చేతికి అందలేదు


ఎఫ్‌35 విమానాల అభివృద్ధి అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా పేరుతెచ్చుకొంది. దాదాపు 200 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో ప్రారంభమై ఈ ప్రాజెక్టు చివరకు 1.5ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. అంటే అక్షరాలా రూ.104 లక్షల కోట్లన్నమాట. ఒక్కో విమానం ఖరీదు 90 మిలియన్‌ డాలర్ల నుంచి 100 మిలియన్‌ డాలర్ల మధ్యలో ఉంటుంది.  ఇప్పుడు ఆ విమానం చైనా, రష్యా నౌకలు తరచూ సంచరించే సముద్రజలాల్లో కూలిపోవడం అమెరికాకు నిద్రపట్టనివ్వడంలేదు. 

Kalank Movie Review Madhuri Dixit Alia Sonakshi Varun Sanjay

                    Kalank Movie Review



మూవీ:     కళాంక్
నటులు :  మాధురి దీక్షీత్ ఆలియాభట్ట్ సోనాక్షిసిన్హా                        వరుణ్ ధావన్ సంజయ్ దత్ ఆదిత్యరాయ్                     కపుర్ కిరాణా అద్వానీ కృతిసనన్ కూనాల్ 
మ్యూజిిిక్:  ప్రీతమ్
కూర్పు    :  శ్వేత వెంకట్
రచన      : హూస్సేన్ దలాల్
సినిమాటోగ్రఫీ : వినోద్ ప్రధాన్
నిర్మాణం  : ఫాక్స్ స్టార్ స్టూడియో   ధర్మా ప్రోడక్షణ్
దర్శకత్వం : అభిషేక్ వర్మన్
రిలీజ్ తేదీ : 17  4  2019


వరుణ్ దావన్ ఆలియాభట్ట్ మూడు చిత్రాలలోజంటగా నటించారు హిట్ పెయిర్ కావడం. దాదాపుగా పాతికేళ్ళ తరువాత మాధురి దిక్షీత్ సంజయ్ దత్ కలిసి నటించారు.
ఇన్ని ఆసక్తికరమైన అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు ఏ విధంగా చేరువయ్యింది చూద్దాం.
కథనం  :  యువరాణి రూప్  (ఆలియా) జఫర్  (వరుణ్) ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మద్య జరిగిన మోసాలు సమాధి అయిన నిజాలు ఒక్క సారిగా బయట పడతాయి . దాంతో రూప్ ను దేవ్  (ఆదిత్యరాయ్)కి వివాహం చేస్తారు. అంతకు ముందే దేవ్ కు సత్య  (సోనాక్షిసిన్హా )కు వివాహం అయింది .రూప్ కి వివాహం జరిగిన తరువాత కూడా జఫర్ ను మరచిపోలేపోతుంది.అసలు రూప్ ను వివాహం అయి ఉన్న దేవ్ కు యిచ్చి ఎందుకు పేళ్లి చేసినట్లు .
బహార్ బేగమ్  (మాధురి దిక్షీత్ )బల్ రావ్ (సంజయ్ దత్)ల కుటుంబాల మధ్య ఏం జరిగింది తదితర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథ కావడంతో మరింత బలంగా తిర్చి దిద్దారు.ముఖ్యంగా రూప్ పాత్రలో ఆలియా ఒదిగిపోయారు.మాధురి డ్యాన్స్ సోనాక్షిసిన్హా ఆదిత్యరాయ్ వరుణ్ సంజయ్ నటనతో మెప్పించారు .తెరపై ఆయా పాత్రలు సంభాషణలు సంగీతం సినిమాటోగ్రఫీ డ్యాన్స్ బాగా పండాయి. కథకు మంచి రచన తోడవడంతో భావోద్వేగాలు సమంగా కుదిరాయి .అక్కడక్కడ లాజిక్ లేనివి ఉన్న ఓవరాలగా సినిమా బాగానే ఉంది .నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి .
వరుణ్ దావన్ ఆలియా భట్ట్ ఆదిత్యరాయ్ వచ్చే సిన్లు బాగా వచ్చింది . ప్రితమ్ సంగీతం సినిమాటోగ్రఫీ నిర్మాణం అంతా బాగున్నాయి .




Tags:  KALANK REVIEW  HINDI MOVIE  VARUN DHAWAN  ALIA BATT SONAKSHI SINHA  MADHURI DIXIT   SANJAY DATT
ADITYARAI KAPOOR  KALANK


Tuesday, April 16, 2019

రాజస్థాన్ పై పంజాబ్ విజయం

                         ప్చ్ రాజస్థాన్ 


రాజస్థాన్‌ రాయల్స్‌కు మరోసారి అదృష్టం కలిసిరాలేదు. ఆది నుంచి గెలుపు బాటలో పయనించి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. అర్షదీప్‌, అశ్విన్‌, షమి తలో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్‌ కుదేలైంది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది.
ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (50; 45 బంతుల్లో 4×4), జోస్‌ బట్లర్‌ (23; 17 బంతుల్లో 1×4, 2×6) శుభారంభం అందించారు. సంజూ శాంసన్‌ (27; 21 బంతుల్లో 2×4) ఆకట్టుకున్నాడు. దీంతో 15 ఓవర్లకు రాజస్థాన్‌ 122/2తో విజయం వైపు పయనిస్తున్నట్టే అనిపించింది. ఆ తర్వాత ప్రతి పది పరుగుల వ్యవధిలో ఓ వికెట్‌ చేజార్చుకోవడంతో ఓటమి పాలైంది. అజింక్య రహానె (26; 21 బంతుల్లో 1×4) వేగంగా ఆడలేదు. జోఫ్రా ఆర్చర్‌ (1), ఆస్టన్‌ టర్నర్‌(0) నిరాశపరిచారు. చివర్లో స్టువర్ట్‌ బిన్నీ (33; 11 బంతుల్లో 2×4, 3×6) మెరిసినా అప్పటికే ఆలస్యమైంది. అంతకుముందు పంజాబ్‌లో కేఎల్‌ రాహుల్‌ (52), క్రిస్‌గేల్‌ (30), మయాంక్‌ అగర్వాల్‌(26), డేవిడ్‌ మిల్లర్‌ (40) రాణించారు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రవిచంద్రన్ ఆశ్విన్ .


Tags :  IPL  T20 CRICKET  IPL CRICKET 


Abhinetri First Look Teaser Tamanna Prabhu Deva

                     అభిినేత్రి 2 టిజర్ 

            తమన్నా ప్రభుదేవా కోవైసరళ నందిత శ్వేత  
మ్యూజిిిక్ సామ్ సిఎస్ నిర్మాత అభిషేక్ వర్మ దర్శకత్వం విజయ్. మే 1న వరల్డ్ వైడ్ రిలీజ్ .




Tags :     ABHINETRI 2 TEASER  TELUGU MOVIE   PRABU DEVA  TAMANNA 


India's Most Wanted Official Teaser Arjun Kapoor

 India's Most Wanted Official Teaser 

ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్’. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. కరుడుగట్టిన ఓ ఉగ్రవాది చేసిన దారుణ ఘటనలను వివరిస్తున్న సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. ఇతనెవరో? ఎలా ఉంటాడో? ఎవ్వరికీ తెలీదు. కానీ అందరూ ‘ఇండియాస్‌ ఒసామా’ అని పిలుస్తుంటారు. ఈ నేరగాడిని పట్టుకోవడానికి ఒక్క బుల్లెట్‌ కూడా వాడకుండా మన దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏం చేశారు?అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిగా అర్జున్‌ కపూర్‌ నటించారు. సినిమాలో అర్జున్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ప్రభాత్‌ పాత్రను పోషించారు. మే 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది




Tags:  INDIA'S MOST WANTED   OFFICIAL TEASER  
ARJUN KAPOOR  BOLLYWOOD MOVIE 



Notre Dame Church Fire

             Notre Dame Church Fire

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి నోట్రే  డామే కేథడ్రల్‌ను పునర్‌నిర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రకటించారు. ఈ ఘటనతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యిందని ఆయన తెలిపారు. అనేక గంటల పాటు నిరంతరాయంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చిన్నపాటి మంటలు ఎగిసిపడుతుండడంతో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే వరకు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తూనే ఉంటారని మేక్రాన్‌ తెలిపారు. అలాగే ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ హెన్రీ పినాల్ట్‌ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్‌ యూరోలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంటలు భయానకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆకాశం నుంచి నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకురావాలని సూచించారు. కానీ దీని ద్వారా చర్చి పూర్తిగా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉందని భావించిన అగ్నిమాపక అధికారులు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు.
చర్చిలో ఆధునికీకరణ పనులు కొనసాగుతుండగా ఒక్కసారిగా సోమవారం సాయంత్రం మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో చర్చి పైకప్పు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం గమనార్హం. 850ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడంతో ఫ్రాన్స్‌ ప్రజలది విడదీయరాని బంధం. ఫ్రెంచి నిర్మాణ శైలికి దీన్ని తార్కాణంగా చెబుతుంటారు. ఫ్రెంచి విప్లవం, పారిస్ స్వాతంత్ర్య పోరాటం లాంటి పలు కీలక ఘట్టాలకు ఈ చర్చి సాక్ష్యంగా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కట్టడం ఒక్కసారిగా మంటలకు ఆహుతవుతుండడంతో దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
                Notre Dame Church Fire 



Tags :   notre dame church  paris  fire 

Monday, April 15, 2019

MS Narayana Special Story

       ఎమ్ ఎస్ నారాయణ ప్రత్యేక కథనం 


ఎం ఎస్ నారాయణ తెలుగు సినిమా ప్రేక్షకులకు కామెడీయన్ ఆర్టిస్టు యాక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇంచుమించు దాదాపుగా 700 చిత్రాలలోఎన్నో వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు .ఈరోజు అయన జయంతి సందర్భంగా స్పెషల్ కథనం . ఎం.ఎస్‌. జీవితం ఎలా ప్రారంభమైందో.. ఆయన గురువు ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ ఇటీవల పంచుకున్నారు.
‘‘ఎంఎస్‌ నారాయణ నా విద్యార్థి అని పరుచూరి గోపాలకృష్ణ చేప్పిన మాటలు మీరు కూడా చూడండి. 
పరుచూరి గోపాలకృష్ణ ఎం ఎస్ నారాయణ ప్రత్యేక కథనం
ఫ్యాక్షన్ కామెడీ  ఎం ఎస్ నారాయణ కామెడీ




Tags :  ms narayana   paruchuri gopalakrishna  telugu movie special story 


Fancy Number 9999 10,00,000 Rupees

                 9999 10 Loc Rupees 

     ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌జోన్‌లో రవాణాశాఖ సోమవారం నిర్వహించిన నంబర్ల వేలం ద్వారా ఒకే రోజు రూ.30,55,748లక్షల రాబడి లభించింది. ఒక్క 9999 నంబరు రూ.10లక్షలు పలికింది. ప్రస్తుతం ముగుస్తున్న సీరీస్‌ టీఎస్‌09 ఎఫ్‌ఈలో 9999 నంబరును ఎన్‌ఎస్‌ఎల్‌ ప్రాపర్టీస్‌ సంస్థ రూ.10లక్షలు చెల్లించి కైవసం చేసుకుంది. పాత సీరీస్‌ ముగిసి కొత్త సీరీస్‌ అయిన ‘టీఎస్‌09 ఎఫ్‌ఎఫ్‌’లోకి అడుగు పెట్టింది. అందులో 1 నంబరును ఎఫ్‌ఆర్‌ఆర్‌ హిల్‌ హోటల్స్‌ రూ.6.95లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. 99 నంబరును ఎమర్జిన్‌ అగ్రినోవో సంస్థ రూ.2.78లక్షలు చెల్లించి దక్కించుకుంది. ఇక్కడ 9 సంఖ్యకు బాగా డిమాండ్‌ ఉన్నా ఈ పర్యాయం అధికారులు నిర్ణయించిన రూ.50వేలకే పోవడం గమనార్హం.
కొత్త సీరీస్‌ ప్రారంభం కావడంతో ఎంతో డిమాండ్‌ ఉన్న 0001 కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేశారు. సాధారణంగా ఫ్యాన్సీ నంబరును కోరుకున్న వారు దాని కోసం అధికారులు నిర్ణయించిన కనీస ధరతో పాటు అధనంగా వారికి ఇష్టమైన మొత్తాన్ని చెక్కుల రూపంలో టెండర్‌ బాక్సులో వేయాలి. నిర్ణీత సమయంలో నలుగురు టెండర్‌ వేశారు. టెండర్‌ బాక్సులోని కవర్లు తీసుకెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి తన కవరును వేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే వేసిన వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో దాడి చేశాడు. అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు

Tags:  fancy   number  

IPL T20 RCB vs MI

     బెంగుళూరు పై ముంబాయి ఘనవిజయం 
ఏబీ డివిలియర్స్‌ (75; 51 బంతుల్లో 6×4, 4×6)కు తోడుగా మొయిన్‌ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) సమయోచిత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ముంబయి ఇండియన్స్‌కు 172 పరుగుల లక్ష్యం నిర్దేశించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. పార్థివ్‌ పటేల్‌ (28; 20 బంతుల్లో 4×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. విరాట్‌ కోహ్లీ (8) విఫలమయ్యాడు. ఏబీడీ ఆటతో బెంగళూరు 190 పరుగులు చేసేలా కనిపించింది. అయితే మలింగ వేసిన ఆఖరి ఓవర్లో డివిలియర్స్‌, అక్షదీప్‌ నాథ్‌ (0), పవన్‌ నేగి (0) వరుసగా ఔట్‌ కావడంతో కోహ్లీసేన 171/7కు పరిమితమైంది
బెంగళూరుకు ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని రోహిత్‌ సేన సునాయాసంగా ఛేదించింది. మరో 6 బంతులు, 5 వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది. ఛేదనలో ఓపెనర్లు డికాక్‌ (40; 26 బంతుల్లో 5×4, 2×6), రోహిత్‌ శర్మ (28; 19 బంతుల్లో 2×4, 2×6) శుభారంభం అందించారు. 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఒకే ఓవర్‌లో పరుగు వ్యవధిలో వెనుదిరిగినా ఇషాన్‌ కిషన్‌ (21; 9 బంతుల్లో 3×6), సూర్యకుమార్‌  యాదవ్‌ (29; 23 బంతుల్లో 2×4, 1×6) మెరుపులు మెరిపించారు. 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైన దశలో హార్దిక్‌ పాండ్య (37; 16 బంతుల్లో 5×4, 2×6) విరుచుకుపడ్డాడు. నేగీ వేసిన 19 ఓవర్‌లో 0, 6, 4, 4, 6, వైడ్‌1తో విజయం అందించాడు.ముంబాయి ఇండియన్స్ 
పాయింట్లు పట్టికలో మూడో స్థానాంలోకి చేరింది .



Tags:   ipl t20 cricket   mi  rcb  csk  srh 
 kkr   rr  kxip   dc  cricket 

India Cricket Team Player's World Cup

                 Team India Cricket 


వచ్చే నెలలో ఇంగ్లాండులో  వరల్డ్ కప్ 
జరగనున్న నేపథ్యంలో ఈరోజు ముంబాయిలో సెలక్షన్ కమిటీ ఏమేస్కే ప్రసాద్ కెప్టెన్ విరాట్ కోహ్లి సమక్షంలో 15 సభ్యులను ప్రకటించారు .పంత్ అంబటిరాయుడుకు చోటు దక్కలేదు. 




Tags:   India   Cricket   TeamIndia 
World Cup 

శ్రద్ధా శ్రీనాధ్ కామెంట్ సమంతా యూటర్న్ సినిమా

              శ్రద్ధా శ్రీనాధ్ కామెంట్ సమంతా యూటర్న్ సినిమా 


కన్నడలో తెరకెక్కిన ‘యూటర్న్‌’ సినిమాకు 
 మాతృకలో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించారు. అయితే తాను మాత్రం సమంత నటించిన ‘యూ టర్న్‌’ సినిమాను చూడలేకపోయానని అంటున్నారు. ‘సమంత నటించిన ‘యూ టర్న్’ సినిమాను పూర్తిగా చూద్దామని ప్రయత్నించా. కానీ అరగంటకు మించి చూడలేకపోయా. ఎందుకంటే నా పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయాను. అవును.. నేను చాలా పొసెస్సివ్‌గా ఉంటాను’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
దాంతో శ్రద్ధ మాటలపై సమంత అభిమానులు సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు




Tags :      Samatha   shradha srinadh 
telugu  movie  u turn movie 

Sunday, April 14, 2019

Prabhas Shradh Kapoor Sahoo Photo Leak

                 సాహో ప్రభాస్ శ్రద్ధా కపూర్ 

    
                 సాహో’ సినిమా సెట్‌లో ఫొటో లీక్‌ అయ్యింది. ఇందులో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా కనిపించారు. పాట షూట్‌లో ఈ ఫొటోను క్లిక్‌ మనిపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌, శ్రద్ధ ఒకర్నొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపించారు. వీరి జోడీకి నెటిజన్లు ఫిదా అయ్యారు. చూడచక్కగా ఉన్నారంటూ తెగ కామెంట్లు చేశారు. సినిమా అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని డార్లింగ్‌ అభిమానులు పేర్కొన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్టిల్‌ను ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు






Tags:      Sahoo   Prabhas   Shradh Kapoor  Movie   Photos 

Bahubali Comment Kabir Singh

           Prabhas Comment Shahid 

                        Kabir Singh 


బాహుబలి’తో అంతర్జాతీయంగా క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌ చూశారట. ఈ విషయాన్ని ఆయన హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌ చెప్పారు. ప్రభాస్‌ ఫోన్‌లో దాదాపు ఏడు నిమిషాలు షాహిద్‌తో మాట్లాడారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘‘సాహో’ సినిమా షూటింగ్‌ కోసం నేను ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నా. ‘కబీర్‌ సింగ్’ టీజర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రభాస్‌ దాన్ని చూసి.. నచ్చిందని చెప్పారు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను ఎంజాయ్‌ చేసిన ప్రభాస్‌ టీం మెంబర్స్‌ కూడా షాహిద్‌ నటనను మెచ్చుకున్నారు. టీజర్‌ చూసిన తర్వాత ప్రభాస్‌ రియాక్షన్‌ చూసి.. నేను షాహిద్‌కు ఫోన్‌ చేసి, ఆయన చేతిలో పెట్టా. ప్రభాస్‌ షాహిద్‌ను ప్రశంసించారు. ఒరిజినల్‌ కంటే ‘కబీర్‌ సింగ్‌’ ఇంకా ఉత్తమంగా ఉందని అన్నారు. దాదాపు ఏడు నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారు’ అని తెలిపారు.




Tags:      Kabir Singh   Hindi Movie   Shahid Kapoor   Kiara Advani  

The Lion King Official Trailer

                            The Lion King



Trailer Link Click 






Tags    The Lion King Official Trailer    Hollywood Movie   #The Lion King 

Krishna : RX100 Movie Payal Rajputh Karthikeya

Krishna : RX100 Movie Payal Rajputh Karthikeya:                                                   RX 100                Payal Rajputh Karthikeya             Bc audience connect ...

Krishna : Payal Raj Puth Bul Reddy Song Sita Movie

Krishna : Payal Raj Puth Bul Reddy Song Sita Movie:               పాయల్ రాజ్ పుత్ బుల్ రెడ్డి సాంగ్ సీత మూవీ బుల్ రెడ్డి సాంగ్ రిలీజ్  పాయల్ రాజ్ పుత్ డాన్స్ సాంగ్ లిరిక్స్  సూపర్. బెల...

Krishna : Student Of The Year 2 Trailer Review

Krishna : Student Of The Year 2 Trailer Review:               ఏ కాలేజీలో ఇలాంటి డ్రస్ లతో వేళ్తారు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2ట్రయలర్ రివ్యూ  ధర్మా ప్రోడక్షణ్ నిర్మాత కరణ్ జోహర్ పై నెట...

Krishna : బెంగుళూరు బోణీ పంజాబ్ పై విజయం

Krishna : బెంగుళూరు బోణీ పంజాబ్ పై విజయం:               విరాట్ కోహ్లి డివిలియర్స్ అర్ద శతకాలు కింగ్స్‌ XI పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బోణీ...