Saturday, April 27, 2019

25 Year's Yamaleela Ali SV Krishna Reddy

               25 వసంతాల యమలీలా

ఎస్ వి కృష్ణారెడ్డి మ్యాజిక్ యమలీలా.నిజమే యమలీలా చిత్రం కృష్ణారెడ్డి సృష్టించిన అద్భుతం. ఆలీని హిరోగా పెట్టి పెద్ద సాహసం చేసి తిసిన చిత్రం యమలీలా. అప్పటికి కామెడీ చేస్తున్న ఆలీని హిరో చేసింది కృష్ణారెడ్డి గారు.కృష్ణ ప్రత్యేక పాటలో నటించారు. కృష్ణారెడ్డి సంగీతం కథనం దర్శకత్వంలో తెరకెక్కించారు .అచ్చిరెడ్డి నిర్మాతగా కిషోర్ రాఠి సమర్పించారు .నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న యమలీలా చిత్రం ఆనాడు రిలీజయిన ఈ చిత్రం 75లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయి సుమారు 12 కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం .ఆలీ ఇంద్రజ హిరో హిరోయిన్ లగా యముడిగా కైకాల సత్యనారాయణ చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం పోలీస్ పాత్రలో కోట శ్రీనివాసరావు విలన్ గా తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. తల్లి కొడుకు సెంటిమెంట్ హస్యం ప్రధానంగా తిసిన చిత్రం భారీ విజయం అందుకుంది .

         Watch Movie Yamaleela Click Here 

Tags: yamaleela telugu movie ali  sv krishnareddy 

Avengers End Game Box Office Report

       Avengers End Game Box Office 

నేను చిటికెస్తే వసూళ్లు  రికార్డు స్థాయిలో ఉంటుంది .ఆవెంజర్స్ ఎండ్ గేమ్ లో థానోస్ చేప్పే డైలాగ్ ఇది .అనుకున్నట్టే ఆవెంజర్స్ ఎండ్ గేమ్ తొలిరోజే వసూళ్లు అరెంజ్ లో ఉన్నాయి. రుస్సో బ్రదర్స్ సృష్టించిన ఆవెంజర్స్ ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విజయం అందుకుని వసూళ్లు పరంగా రికార్డులను కొల్లగొడుతుంది
ఆరుగురు సూపర్ హిరోలు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు విశ్వాని అంతం చేయాలి అని చూసే థానోస్ దుర్మార్గుని నుండి విశ్వాని కాపాడే సూపర్ హిరోలు ఈ ఆవెంజర్స్. 
ఆవెంజర్స్ ఎండ్ గేమ్ తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు. ఆవెంజర్స్ కూ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆసక్తి దృష్ట్యా భారీస్థాయిలో విడుదల చేశారు. అమెరికా ఇండియా చైనా దేశం ఏదైనా రికార్డులు సృష్టించింది. అమెరికాలో అత్యధిక తెరలపై విడుదలైంది ఈ చిత్రం .దాదాపుగా 4662తెరలపై రిలీజ్ అయింది .అమెరికాలో ప్రిమియర్స్ ద్వారా 420కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం .చైనాలో 608ధీయెటర్లలో విడుదలైంది .చైనాలో సుమారు 750కోట్లు మొదటి రోజు వసూళ్లు సాధించింది .ఇండియాలో 2846తెరలపై విడుదలైన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇండియాలో ప్రధాన నగరాలలో 24 గంటలపాటు మల్టిప్లెక్ష్సుల్లో ప్రదర్శించారు .ఇండియా వ్యాప్తంగా 53కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం.ప్రపంచ వ్యాప్తంగా ఆవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రిమియర్స్ ద్వారా సుమారు 2130 కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం .
Tags: avengers end game  box office report 

MEN IN BLACK: INTERNATIONAL CRISH HEMSWORTH

                     MEN IN BLACK:                              INTERNATIONAL #Trailer

MIB International Official Trailer Click
June 14th World Wide Release 

Tags :  men in black: international  chris hemsworth 

 

28°C Movie Teaser

           చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా?

నవీన్ చంద్ర వి శాలీనీ నటించారు. దర్శకత్వం అనిల్ విశ్వనాథన్ నిర్మాత ఎస్ సాయి అభిషేక్ సంగీతం శ్రావణ్ భరద్వాజ్.
చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటూ ఆసక్తి కరంగా టిజర్ వదిలారు. 
నవీన్ చంద్ర అరుదైన ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ కనిపించారు .ఒత్తిడికి గురి కావడంతో అరుదైన వ్యాధితో  బ్రెయిన్ దెబ్బతింది .ఇలాంటి సమస్యను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు.చుట్టూ స్థిరమైన ఉష్ణోగ్రత ఉంచుకోవాలి.లేకపోతే 10, 15 నిమిషాల్లో చనిపోతాడు అని వైద్యుడు చేప్తాడు .
టిజర్ చూడండి Click .

Tags:  28°C Teaser  Telugu Movie  Naveen Chandra 

Hrithik Rosan Fitness Video

          Hrithik Rosan Fitness Video 

‘ఈ ప్రయాణంలో తీసిన కొన్ని క్లిప్స్‌ను మీకు షేర్‌ చేశా. తక్కువ బరువులు లిఫ్ట్‌ చేయడం, బ్యాండ్‌ వర్క్‌.. ఇలా వివిధ టెక్నిక్‌లు పాటించా. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే... రోజు వారి అభివృద్ధిని పుస్తకంలో రాసిపెట్టుకున్నా. తర్వాతి రోజు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలనే లక్ష్యం పెట్టుకున్నా. నాలా గాయపడ్డ వారికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. నేను గాయాల నుంచి చాలా నెమ్మదిగా కోలుకుంటూ వచ్చా. మూడు నెలల సాధన తర్వాత కాస్త ఫలితం కనిపించింది. దీన్ని పూర్తి చేయగలనా అని నాపై నాకే అనుమానం కల్గింది, కానీ ఓ మేజిక్‌ తరచూ నన్ను ముందుకు నడిపించింది’ అని హృతిక్‌ పోస్ట్‌ చేశారు
Watch Fitness Video Click Here 



Tags :  hrithik rosan  fitness video 

Friday, April 26, 2019

PM Modi Bank Balance 4 Thousand Rupees

                PM Modi Nomination 

Elections Nomination Click


Tags :  PM MODI  ELECTION  NOMINATION 

Avengers End Game Review Action Movie

          Avengers End Game Review 

Movie  అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌
Star Cast  రాబర్ట్‌ డౌనీ జూనియర్‌.. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌.. మార్క్‌ రఫెలో.. క్రిస్‌ ఇవాన్స్‌.. స్కార్లెట్‌ జొహాన్సన్‌.. టామ్‌ హొలాండ్‌.. విన్‌ డీసిల్‌.. క్రిస్‌ ప్రాట్‌ తదితరులు
Music అలెన్‌ సిల్వస్ట్రీ
Cinematography  ట్రెంట్‌ ఆప్లాచ్‌
Editor జెఫ్రీ ఫోర్డ్‌, మాథ్యూస్‌
Producer కెవిన్‌ ఫిజీ
Director  ఆంటోని రుస్సో.. జో రుస్సో..
Production మార్వెల్‌ స్టూడియోస్‌
Date 26-04-2019
ఇప్పటివరకూ హాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హీరో చిత్రాలు వచ్చాయి. ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న దుష్టశక్తులపై ఆ సూపర్‌ హీరోలందరూ తమదైన శైలిలో పోరాడి ప్రేక్షకులతో ఔరా! అనిపించారు. ఈ విశ్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అందుకోసం అత్యంత శక్తివంతమైన ఆరు ఇన్ఫినీటీ స్టోన్స్‌ను సంపాదిస్తాడు థానోస్‌. అతన్ని ఎదుర్కొవడానికి ‘అవెంజర్స్‌’ బృందం యత్నించి ఓడిపోతుంది. కొందరు సూపర్‌హీరోలు అదృశ్యమైపోతారు. గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా, అదృశ్యమైన కొందరు సూపర్‌హీరోలు ఎలా తిరిగి వచ్చారు?  మిగిలిన వారితో కలిసి థానోస్‌ను ఎలా ఎదుర్కొన్నారు? అని చెప్పే చిత్రమే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’. విడుదలకు ముందే బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
     థానోస్‌ శక్తివంతమైన ఇన్ఫినిటీ స్టోన్స్‌తో సగానికిపైగా ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అదే సమయంలో కెప్టెన్‌ మార్వెల్‌ నెబులాను, అంతరిక్షంలో చిక్కుకుపోయిన టోనీ స్టార్క్‌ను కాపాడుతుంది. వారు భూమిపైకి చేరుకుని బ్లాక్‌విడో, హల్క్, కెప్టెన్‌ అమెరికా, రాకెట్‌, థార్‌ తదితరుల బృందాన్ని కలుస్తుంది. థానోస్‌ చేతిలో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తీసుకుని, అతని చర్యలు అడ్డుకట్టవేయాలని భావిస్తారు. థానోస్‌ దగ్గరకు వెళ్లిన అవెంజర్స్‌ ఆశ్చర్యపోతారు. ఆ స్టోన్స్‌ను ఎవరూ వాడకూడదనే ఉద్దేశంతో నాశనం చేసినట్లు చెబుతాడు. దీంతో కోపంతో థార్‌.. థానోస్‌ తలను నరికేస్తాడు. అయితే, కాలంలో ప్రయాణించి ఆ రాళ్లను సంపాదిస్తే, థానోస్‌ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకురావచ్చని అవెంజర్స్‌ భావిస్తారు. అందుకు వారు ఏడు గ్రూప్‌లుగా విడిపోతారు. మరి అలా విడిపోయిన అవెంజర్స్‌ ఆ స్టోన్స్‌ను సంపాదించారా? థానోస్‌ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకొచ్చారా? తల నరికినా థానోస్‌ ఎలా బతికాడు? చివరకు అతన్ని అవెంజర్స్‌ ఎలా అంతం చేశారు? అన్నదే ‘ఎండ్‌గేమ్‌’ కథ.
          ‘అవెంజర్స్‌ఇన్ఫినిటీవార్‌’కు ఇది కొనసాగింపు అని చెప్పాలి. అందులో చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. వాటన్నింటికీ ఇందులో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు దర్శకులు రుస్సో బ్రదర్స్‌. అందుకు తగినట్టుగానే సన్నివేశాలను రాసుకున్నారు. అదృశ్యమైన సూపర్‌హీరోలు కలవడం.. థానోస్‌ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తిరిగి సంపాదించడం ద్వారా అతని చర్యలకు అడ్డుకట్టవేయాలని చూడటం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే, ఎప్పుడైతే అతను వాటిని నాశనం చేసినట్లు చెబుతాడో.. సూపర్‌హీరోలు వాటిని ఎలా తిరిగి తెస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. 
వారంతా కాలంలో ప్రయాణించి గతంలోకి వెళ్లడం, అక్కడ జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హల్క్‌, రాకెట్‌లతో నవ్వులు పంచే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. సినిమా దాదాపు 3గంటల పాటు సాగుతుంది. రుస్సో బ్రదర్స్‌ తాము అనుకున్న చాలా సన్నివేశాలను అలాగే చూపించాలనుకున్నారు. అందుకే ప్రథమార్ధంలో చాలా సన్నివేశాల్లో కాస్త సాగదీత కనిపిస్తుంది. ఆయా సన్నివేశాలకు కత్తెర వేస్తే ఇంకాస్త బాగుండేది. ఆ ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సంపాదించిన తర్వాత అవెంజర్స్‌ బృందం థానోస్‌ను ఎలా ఎదుర్కొందో ద్వితీయార్ధంలో చక్కగా చూపించారు దర్శకులు. అద్భుతమై యాక్షన్‌ సన్నివేశాలకు తోడు, భావోద్వేగ సన్నివేశాలో ప్రేక్షకులను కట్టిపడేశారు. అవెంజర్స్‌ అభిమానులను క్లైమాక్స్‌ కంటతడి పెట్టిస్తుంది


Tags: AVENGERS END GAME  HOLLYWOOD MOVIE  REVIEW TELUGU  SUPER HERO'S 

Thursday, April 25, 2019

Aladdin Telugu Teaser Venkatesh Varun Tej

               అల్లాద్దీన్ వెంకటేశ్ వరుణ్ తేజ్ 


పాపులర్ కార్టూన్ యానిమేషన్ సిరియల్స్ మూవీ అల్లాద్దీన్ అలరించడానికి రెడీగా ఉంది .ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ జినిగా అల్లాద్దీన్ మెకా మన్సుద్ కనిపించనున్నాడు.
తెలుగు టిజర్ విడుదల చేశారు .జినికి వెంకటేశ్ అల్లాద్దీన్ కి వరుణ్ వాయిస్ యిచ్చారు.మే24న విడుదల.
Telugu Teaser Aladdin  Click Here 

Tags ALADDIN OFFICIAL TRAILER  WILL SMITH  VENKATESH VARUN TEJ  TELUGU MOVIE  

Avengers End Game Special Story

    Avengers End Game Special Story 

ఆంటోని రుస్సో,జో రుస్సో దర్శకత్వంలో ఆవెంజర్స్ ఎండ్ గేమ్ రూపుదిద్దుకుంది .ఆవెంజర్స్ ఆనే సూపర్ హిరోలు బృందం విశ్వాని అంతం చేయాలి అని చూసే థానోస్ దుర్మార్గున్ని ఆవెంజర్స్ బృందం ఎలా అంతం చేశారు ఆనే కథతో తెరకెక్కించారు. రాబర్ట్ డౌనీ, క్రిస్ ఈవాన్స్ ,మార్క్ రఫెలో,క్రిస్ హేమ్స్ వర్త్,స్కార్లెట్ జాన్సన్,బ్రిలార్సన్, బ్రాడ్లి కూపర్ లాంటి ప్రముఖులునటించారు. 
కోన్ని చోట్ల విడుదలైన ఈ చిత్రం అమెరికాలో ఇండియాలో శుక్రవారం విడుదలవుతుంది. ఇప్పటికే అన్ లైన్ బుకింగ్ చాలా చోట్ల అగ్రస్థానంలో నిలిచింది బుక్ మై షో ఆప్ లో24గంటలకు 10లక్షల టికెట్లు అమ్ముడైనట్టు వెల్లడించారు .అమెరికాలో ఫాన్ డాంగ్ బుకింగ్ ఆప్ లో స్టార్ వార్ ది ఫోర్స్ అవేకెన్స్ 24 గంటలకు అమ్ముడుపోయిన టికెట్లును ఆవెంజర్స్ ఎండ్ గేమ్ 8గంటలకే అధిగమించింది.
ఇండియాలో ఆవెంజర్స్ ఇన్పినిటి వార్ తోలిరోజు వసుళ్లు 64కోట్ల డాలర్లు. ఆవెంజర్స్ ఎండ్ గేమ్ తొలిరోజే 100కోట్లు డాలర్లు వసూళ్లు సాధించే విధంగా ఆన్ లైన్ బుకింగ్ రికార్డు స్థాయిలో వుంది. చైనాలో కూడా ఆన్ లైన్ బుకింగ్ అగ్రస్థానంలో నిలిచింది .
ఇప్పటి వరకు ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అవతార్ సుమారు 278కోట్లు డాలర్లు పైన వసుళ్లు సాధించింది .ఎ చిత్రం కూడా ఆ వసూళ్లు అధికమించలేదు.ఆవెంజర్స్ ఎండ్ గేమ్ కున్న పాపులర్ బట్టి అన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయం. 
కోన్ని దేశాల్లోవిడుదలైన ఆవెంజర్స్ ఎండ్ గేమ్ కూ మంచి రివ్యూష్ ఇస్తున్నారు .
Official Trailer Click Here 

Tags: AVENGERS END GAME  HOLLYWOOD MOVIE 

Wednesday, April 24, 2019

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ సల్మాన్ ఖాన్ హిరోయిన్

      రాజమౌళి సలహా యిచ్చిన సల్మాన్ ఖాన్

ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ కు జోడీగా ఆలియా తారక్ కి డైసీ ఎడ్గార్గ్ జోన్స్ నటించనున్నట్ల మొదట ప్రకటించారు. ఆయితే కోన్ని కారణాల వల్ల డైసీ ఎడ్గార్గ్ జోన్స్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు .ఇప్పుడు తారక్ కి జోడీ గా జాక్వేలీన్ పెర్నాడెంజ్ తిసుకోమని రాజమౌళికి సల్మాన్ ఖాన్ సూచించినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి .
జాక్వేలీన్ పెర్నాడెంజ్ కోద్దిగా బ్రిటిష్ పోలికలు ఉండడంతో సల్మాన్ ఖాన్ సూచించినట్లు తెలుస్తుంది .సల్మాన్ జాక్వేలీన్ మంచి ఫ్రెండ్స్ విరిద్దరూ క్లిక్ తదితర సినిమాలో నటించారు .రాజమౌళి మనసులో నిత్యామీనన్ శ్రద్ధా కపూర్ పరిణితి చోప్రా తదితరులు సెలెక్ట్ చేయాలని చూస్తూన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ 2020 జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో అల్లూరి సితారామరాజు పాత్రలో చరణ్ ఆలియా కోమరం భీమ్ పాత్రలో తారక్ ఎమ్ ఎమ్ కిరవాణి సంగీతం విజయేంద్ర ప్రసాద్ కథనం డివివి దానయ్య నిర్మాత రాజమౌళి దర్శకత్వం. 

Tags: SALMAN KHAN   RAJAMOULI  RRR MOVIE CHARAN TEJ  NTR  TELUGU MOVIE 

#Slow Motion Video Song Bharat Salman Khan

     #Slow Motion Song Salman Khan 

Bharat Motion Song Salman Khan Disha Patani Video Click Here
Video Song  #Slow Motion Click Here 

Tags:  BHARAT SALMAN KHAN KATRINA KAIF ABBAS ALI JAFER DISHA PATANI MUSIC 

#పదరా మహర్షి సాంగ్ మహేష్ బాబు పూజా హెగ్డే

              పదరా లిరిక్స్ సూపర్ సాంగ్ 

దేవీశ్రీప్రసాద్ మ్యూజిిిక్ భాస్కర భట్ల కలం శంకర్ మహదేవన్ గానం సూపర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్.
                     Play Video Click  Here 

Tags : MAHARSHI  PADARA SONG  #MAHESH BABU POOJA HEGDE DEVISRI PRASAD 

Mumbai Dilli to Kudiyaan Student Of The Year 2 Song

            Mumbai Dilli to Kudiyaan 

Click Video 
#Tiger Shroff  Ananya Tara 
#Student of the year 2 #Mumbai dilli Kudiyaan song 


Sachin Tendulkar Birthday Special Story

           సచిన్ టెండూల్కర్ స్పెషల్ కథన

                


సచిన్ టెండూల్కర్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు .
ఈరోజు సచిన్ టెండూల్కర్ 47వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సచిన్ గురించి కోన్ని విశేషాలు గుర్తుచేసుకుంద్దాం.1973 ఏప్రిల్ 24 న మహారాష్ట్ర లో ప్రముఖ మరాఠీ నవల రచయిత రమేష్ టెండూల్కర్ ఇంట్లో జన్మించారు . సంగీత విద్వాంసులు సచిన్  దేవ్ బర్మన్ కు వీరాభిమాని రమేష్ టెండూల్కర్ తన కుమారుడు కోసం అ పేరు పేట్టారు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడటం తన మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడటం ప్రారంభించారు .200 టెస్టులు 100అంతర్జాతీయ శతకాలు మొత్తం 34వేల పరుగులు  టెస్టు మ్యాచ్ లో 15వేల పైగా పరుగులు వన్డే లో 18వేలకు పైగా పరుగులు వన్డే లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్సమెన్ సచిన్ కావడం విశేషం .2010 లో గ్వాలియర్ సౌత్ ఆఫ్రికాతో ఈ ఫిట్ సాధించాడు .గ
ఆరు సార్లు ప్రపంచ కప్ కు ఆడిన ఏకైక క్రికెటర్ మన సచిన్ టెండూల్కర్ .2013 నవంబర్ 13అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు .

1994 లో  అర్జున్ అవార్డు 
1997 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 
1999లో పద్మశ్రీ అవార్డు 
2008లో పద్మ వీభూషణ అవార్డు 
2014లో భారత్ రత్న అవార్డులతో సత్కరించింది. 
మన క్రికెట్ దేవుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జైహింద్.

Tags: SACHIN TENDULKAR  CRICKET  INDIA TEAM 


Anushka Shetty Like Hero

               అనుష్కాకు నచ్చిన హిరోలు

వీడీయో క్లిక్ అనుష్క చేప్పిన హిరోలు చేయండి .

Tags; ANUSHKA SHETTY  GOSSIPS TELUGU  MOVIE  HERO 



Tuesday, April 23, 2019

PM Modi Interview With Akshay Kumar

      PM Modi Interview With Akshay 

                Live Interview Modi Akshay


Tags :  PM Modi  INTERVIEW  AKSHAY KUMAR HINDI MEDIA 

చెన్నై ప్లేఆఫ్ కూ సన్ రైజర్స్ ఐదో ఓటమి

    సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై విజయం 

వార్నర్ ఎప్పటిలానే రాణించాడు మనీష్ పాండే కూడా బ్యాటింగ్ తో మంచి పునాది వేసిన పేలవమైన బౌలింగ్ ఫీల్డింగ్ ఐదో ఓటమి పాలయ్యింది. 175పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై వాట్సన్ ధాటిగా బ్యాటింగ్ జరలిపించడంతో విజయం చెన్నైను వరించింది .దింతో ప్లేఆఫ్ కూ చేరినట్లే చెన్నై. ప్లేఆఫ్ కూ చేరిన మొదటి జట్టు చెన్నై నే .

Tags: IPL T20 CRICKET  CSK VS SRH

Godzilla King Of The Monster Official Trailer

        Godzilla King Of The Monster 
Trailer Click Here 

Tags: GODZILLA  KING OF THE MONSTER  MOVIE 

Waters Spills Over Penthouse

Water Spills Over Penthouse


Tags:  Philippines  Manila 

Monday, April 22, 2019

Sya Raa Movie Latest News

                  సైరా మూవీ లో అనుష్క 

సైరా మూవీ మొదలు అనుష్క కూడా నటిస్తున్నారు అంటు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నారు .అనుష్క తరుపున గానీ చిత్రం బృందం తరఫున పక్క క్లారిటీ లేదు. అయితే మీ కోసం ఈ వీడియో Click చేేయండి. 

Tags :  SYERAA MOVIE  CHIRANJEEVI ANUSHKA GOSSIPS TELUGU 

Delhi Capitals vs Rajasthan Royals IPL T20 Cricket

                  Delhi vs Rajasthan 

ఢిల్లీ రాజస్థాన్ మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో పంత్ చేలరేగి ఆడటంతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది.11మ్యాచ్ లు అడిన ఢిల్లీ పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ కూ చేరినట్లే. రాజస్థాన్ బ్యాటింగ్ లో ఆజింక్య రహనే సెంచరీ స్మిత్ హఫ్ సెంచరీలతో 191 పరుగులు చేసింది .అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ పృధ్వీసా దావన్ ధాటిగా బ్యాటింగ్ లైనఫ్ తో విరికి తోడు పంత్ చేలరేగి ఆడటంతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది .
రహనే సెంచరీ చేసిన కూడా గెలవలేదు .ఈ మ్యాచ్ లో పంత్ బ్యాటింగ్ హైలైట్ .

Tags: IPL T20 CRICKET   RR vs DC

తెలంగాణా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత

        తెలంగాణా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత 

తెలంగాణాలో ఇంటర్ బోర్డు నిర్వాకంతో చేలరేగిన  అలజడి రెండో రోజు కూడా మరింత తివ్రరూపం విద్యార్థులు తల్లిదండ్రులు బారిగా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చారు .నవ్య విద్యార్థికి 99 బదులు 0 మార్కులు వేయడం . దిద్దుబాటు చర్యలకు ఇంటర్ బోర్డు ఉపక్రమించారు.విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు బారిగా తరలివచ్చిన విద్యార్థులు కట్టడి చేసేందుకు బారిగా మోహరించిన పోలిసులు .
వీడియో కోసం Click చేేయండి .

Tags:  INTER RESULTS  TELANGANA NEWS  
IN

Bharat Official Trailer Salman Khan Katrina Kaif

             భారత్ ట్రయలర్ సల్మాన్ ఖాన్ 

సల్మాన్ ఖాన్ ఐదు విభిన్నమైన పాత్రలో కనిపించనున్న భారత్ ట్రయలర్ వచ్చేసింది.సల్మాన్ ఉద్యోగ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో   కత్రినా కైఫ్ ప్రభుత్వా ఉద్యోగినిగా ని పేరేమిటి అని అడుగుతారు .నా పేరు భారత్ అని సల్మాన్ ఖాన్ చేప్పండ బాగుంది .మా నాన్న దేశంపై ప్రేమతో నాకు అ పేరు పేట్టారని అమాయకంగా చేప్తాడు.
యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. పాటలు సంగీతం సినిమాటోగ్రఫీ నిర్మాణం అంతా రిచ్ ఉన్నాయి .అబ్బాస్ ఆలీ జఫర్ దర్శకత్వం సల్మాన్ ఖాన్ ఫ్యాక్టరీ నిర్మాణం. జూన్ ఐదున ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు .
                 ట్రయలర్ వీడియో క్లిక్  చేయంండి .

Tags:  BHARAT  SALMAN KHAN  KATRINA KAIF ABBAS ALI JAFER  BOLLYWOOD MOVIE  BHARAT  OFFICIAL TRAILER 

Sunday, April 21, 2019

Best Finisher Dhoni Excellent batting

            ఉత్కంఠగా సాగిన ధోని బ్యాటింగ్ 

నిన్న జరిగిన బెంగుళూరు చేన్నై మధ్య ఐపిఎల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగిన ధోని బ్యాటింగ్ .6 బంతుల్లో 26 పరుగులు.. ఎలాంటి బ్యాట్స్‌మన్‌కైనా ఈ సమీకరణం కష్ట సాధ్యమే! ఒకప్పటి ధోని మీద అయితే ఆశలు పెట్టుకోవచ్చు కానీ.. ఈ మధ్య అతడిలో మునుపటి ఊపు కనిపించని నేపథ్యంలో ఛేదన అసాధ్యం లాగే అనిపించింది! కానీ ధోని అనూహ్య రీతిలో చెలరేగిపోయాడు. చెన్నైని విజయపుటంచుల దాకా తీసుకెళ్లాడు. ఇక చెన్నై గెలుపు లాంఛనమే అనుకునేలా చేశాడు. కానీ ఆఖరి బంతికి ఊహించనిది జరిగింది. మ్యాచ్‌ బెంగళూరు వశమైంది. ఓవర్‌ తొలి బంతికి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టిన ధోని.. రెండో బంతిని పుల్‌ చేస్తూ మిడ్‌వికెట్‌ దిశగా స్టేడియం అవతల పడేలా కొట్టడం విశేషం. బంతి ఏకంగా 111 మీటర్లు ప్రయాణించిందంటే ధోని ఎంత బలంగా, కసిగా ఆ బంతిని కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్‌తో ధోని ఆత్మవిశ్వాసం రెట్టింపై.. తర్వాతి బంతికి కూడా సిక్సర్‌ అందుకున్నాడు. ఈసారి లాంగాఫ్‌లో బంతి బౌండరీ దాటింది. నాలుగో బంతికి రెండు పరుగులు రావడంతో చివరి 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఉమేశ్‌ ఓ చెత్త బంతి వేశాడు. యార్కర్‌ కోసం ప్రయత్నించాడో ఏమో కానీ.. అది ధోని కాళ్ల మీదికి పుల్‌టాస్‌లా వచ్చింది. అతను అలవోకగా మిడ్‌వికెట్‌, స్క్వేర్‌ లెగ్‌ మధ్యలో సిక్సర్‌ బాదేశాడు. ఒక బంతికి 2 పరుగులు చేస్తే చాలు. 5 బంతుల్లో 24 పరుగులు చేసిన వాడికి ఇదో లెక్కా? ఇంకేముంది చెన్నై విజయం లాంఛనమే అనిపించింది. కానీ మధ్యలో డివిలియర్స్‌తో మంతనాలు జరిపిన ఉమేశ్‌.. ఈసారి వేగం తగ్గించి ఆఫ్‌ స్టంప్‌ ఆవల లెంగ్త్‌ బాల్‌ వేశాడు. ధోని దాన్ని పాయింట్‌ వైపు కట్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. పరుగు తీసే ప్రయత్నం చేశాడు. వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ బంతిని అందుకుని వికెట్లకు డైరెక్ట్‌ త్రో వేసేశాడు. అవతలి ఎండ్‌ నుంచి వచ్చిన శార్దూల్‌.. డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది. స్వల్ప తేడాలో అతను రనౌటైపోయాడు. పరుగు పూర్తయితే మ్యాచ్‌ టై అయ్యేది. సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చేది.ధోని కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే.
Tags: IPL T20 CRICKET  RCB VS CSK  DHONI  VIRAT KOHLI 

Dhoni vs Virat IPL T20 CSK vs RCB

    ఒక్క పరుగు తేడాతో గెలిచిన బెంగుళూరు 

చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్క పరుగుతో గెలిచింది. ధోనీ(84, 48 బంతుల్లో 5x4, 7x6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో బెంగళూరును ఓడించినంత పని చేశాడు. అతడికి అంబటిరాయుడు(29) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ సహకరించలేదు. దీంతో చెన్నై జట్టు చివరి బంతివరకూ పోరాడి ఒక్క పరుగుతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 24 పరుగులు అవసరం కాగా ధోనీ మూడు సిక్సులు, ఒక ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు చెయ్యాల్సిన స్థితిలో పార్థివ్‌పటేల్‌ ఠాకుర్‌ని రనౌట్‌ చేశాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది.
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ(9) తక్కువ స్కోరుకే ఔటైనా మరో ఓపెనర్‌ పార్థివ్‌పటేల్‌ (53, 37 బంతుల్లో 2x4, 4x6) ధాటిగా ఆడి అర్ధశతకం సాధించాడు. అతడికి ఏబీ డివిలియర్స్‌(25), అక్ష్‌దీప్‌నాథ్‌(24), మార్కస్‌స్టోయినిస్‌(14) సహకారం అందించారు. చివర్లో మొయిన్‌ అలీ(26, 16 బంతుల్లో 5x4) దూకుడుగా ఆడి బెంగళూరు స్కోరును 160 దాటించాడు. కాగా చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, బ్రావో రెండేసి వికెట్లు తీయగా ఇమ్రాన్‌ తాహిర్‌ ఒక వికెట్‌ తీశాడు

Tags: IPL T20 CRICKET  RCB VS CSK 

అదరగగోట్టిన సన రైజర్స్ హైదరాబాద్ T20 CRICKET

       సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం 

ఆఫ్ సెంచరీలతో చేలరేగిన వార్నర్ బెయిర్ స్టో. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. బెయిర్‌స్టో(80, 43 బంతుల్లో 7x4, 4x6), డేవిడ్‌వార్నర్‌(67, 38 బంతుల్లో 3x4, 5x6) అర్ధశతకాలతో చెలరేగడంతో 15 ఓవర్లకే గెలుపొందింది. చివర్లో వార్నర్‌ ఔటైనా, బెయిర్‌స్టో, విలియమ్సన్‌(8) లాంఛనాన్ని పూర్తిచేశారు.
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్రిస్‌లిన్‌(51) అర్ధశతకంతో ఆ జట్టుని ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోర్‌ సాధించింది. సునిల్‌ నరైన్‌(25), రింకుసింగ్‌(30) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేదు. రసెల్‌ చివర్లో రెండు సిక్సులు బాదినా భారీ స్కోర్‌ చెయ్యలేదు. దీంతో కోల్‌కతా ఎనిమిది వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్‌ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Tags: IPL T20 CRICKET  SRH  KKR 

ఉపాసన నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది

              ఉపాసన గురించి రామ్ చరణ్ 

ఉపాసన అవార్డు పట్టుకున్న ఫొటోను చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘డియరెస్ట్‌ ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్‌’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 46 వేల మందికి పైగా లైక్‌ చేశారు.
అవార్డు అందుకున్న సందర్భంగా ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘చాలా సంతోషంగా ఉంది. సోషల్‌మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూ, నన్ను మోటివేట్‌ చేస్తున్నవారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటూ మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Tags:  Ram Charan Tej   Upasana                             Facebook  Social Media