Saturday, April 6, 2019

Maharshi 10 million views Mahesh Babu

Fastest 10milion views పుల్ స్టాప్ లేవు ఓన్లి కామలు మాత్రమే
https://youtu.be/W2L9BdeVP5M
                           వెంకిమామ ఫస్ట్ లుక్

వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న ‘వెంకీమామ’ ఫస్ట్‌లుక్‌ని ఉగాది పండగ సందర్భంగా శనివారం విడుదల చేశారు. శుక్రవారమే టైటిల్‌ లోగోని విడుదల చేసిన చిత్రబృందం, శనివారం మామాఅల్లుళ్లు కలిస్తే ఎలాంటి హంగామా ఉంటుందో మచ్చుకు కొంచెం రుచి చూపించింది. మామాఅల్లుళ్లు నవ్వుతూ కనిపిస్తున్న లుక్‌ అభిమానుల్లో జోష్‌ని నింపింది. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 8 నుంచి కొత్త షెడ్యూల్‌ కోసం రంగంలోకి దిగబోతున్నారు మామాఅల్లుళ్లు.

Maharshi Teaser Review

మహర్షి టిజర్ తనికెళ్ళ భరణి రివ్యూ

Andhra Pradesh Politics TDP Chandrababu

                 తెలుగుదేశం మేనిఫెస్టో
   మేనిఫెస్టోలో  ముఖ్యమైన హామీలివే.. 
 అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు అమలు. వచ్చే ఖరీఫ్‌ నుంచి కౌలు రైతులకూ ఈ పథకం వర్తింపు.
⇒ వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
 డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కొనసాగింపు
 ఉచితంగా ఉన్నత విద్య
 ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం, అలాగే ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన
 ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షలకు పెంపు
 చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
 పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
 అందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం
 ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం 
రైతులకు 12గంటల పాటు ఉచిత విద్యుత్‌..
 రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
 రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.
 రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెటింగ్‌ వ్యవస్థల బలోపేతం
 ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు 
 రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు
 గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు
 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలు కోటి ఎకరాలకు విస్తరింపు
 మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్ప్రింక్లర్‌  వ్యవస్థలు ఏర్పాటు
 కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు
⇒ వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

చంద్రన్న బీమా రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
  చంద్రన్న భరోసా పింఛన్లు రూ.2వేల నుంచి 3వేలకు పెంపు. 
 నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం. ఇంటర్‌ పాసైతే చాలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 
 ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం.
 వృద్ధాప్య పింఛనుదారుల అర్హతను 65 నుంచి 60ఏళ్లకు  తగ్గింపు
 చంద్రన్న పెళ్లికానుక కింద ఇచ్చే మొత్తం రూ.లక్షకు పెంపు
  20వేల జనాభా దాటిన పంచాయతీలు, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు
 యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తాం.
 కేంద్రంతో పోరాడి వ్యవసాయంతో నరేగా అనుసంధానం
 ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్‌ తీసుకొస్తాం.
 బీసీల్లో చేపల వేటకు వెళ్లే వారిలో క్రాప్‌ హాలిడే కింద రూ.10 వేలకు పెంపు. డీజిల్‌ ప్రోత్సాహకం రూ.10కి పెంపు. 
 పేద కుటుంబాలకు పండుగల నాడు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు
 వర్గీకరణలో పెండింగ్‌లో ఉన్న కులాలకు న్యాయం జరిగేలా చూస్తాం.
⇒ రాజకీయ ప్రాతినిథ్యం లేని వడ్డెర, బ్రాహ్మణ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తాం. 

డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు
 డ్వాక్రా మహిళలకు పసుపు - కుంకుమ పథకం కొనసాగింపు
 మహిళా ఉద్యోగులకు ద్విచక్రవాహనాల కొనుగోలుకు రాయితీలు
 ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో మహిళా వసతి గృహాలు
 చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి
 ఈ ఐదేళ్లలో కోటి మంది మహిళలకు రూ.లక్ష కోట్లు సాయం చేశాం. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సాయాన్ని 2లక్షల కోట్లకు పెంచుతాం.
 వడ్డీ రాయితీ పథకం అర్హత పరిమితి రూ.10లక్షలకు పెంపు
 మహిళా సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు ఉపాధి నైపుణ్య శిక్షణ
 ప్రతి మహిళ కుటుంబ ఆదాయం నెలకు రూ.20వేలు వచ్చేలా పథకాలు

ఏపీని పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
 రాష్ట్రంలో 15,358 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు
  గ్రామీణ ప్రాంతాల్లో మోడల్‌ ప్రీ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య
  ప్రీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం
  గిరిజన ప్రాంతాల గర్భిణులకు హోమ్‌ ఫర్‌ ప్రిగ్నంట్‌ ఉమెన్‌ ఏర్పాటు
 రూ.100 కోట్లతో ఇన్నోవేటివ్‌ ఫండ్‌
 రాజమహేంద్రవరం, ఏలూరు, తిరుపతిని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం.
 మెగా టెక్స్‌టైల్‌ ప్లాంట్లలో 3 లక్షల ఉద్యోగాలు.
 తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ పెద్ద ఎత్తున తీసుకొస్తాం.
 విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌.
 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా కృషి
 ఆరోగ్య పర్యాటకాన్ని (హెల్త్‌ టూరిజం) అభివృద్ధి చేస్తాం. 

విదేశీ విద్యకు ఉపకార వేతనాలు రూ.25లక్షలకు పెంపు
 రైతు పంట ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేలా ఏర్పాటు
 చిన్న ఆక్వా రైతులు, రైతు గ్రూపులకు రాయితీలు, కోల్డ్‌ స్టోరేజీల సౌకర్యం
 తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు అవసరం మేరకు జెట్టీల నిర్మాణం
 ఫిషరీస్‌ యూనివర్సిటీ, ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ స్థాపిస్తాం

ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు 
 రూ.100 కోట్లతో అంబేడ్కర్‌ స్మృతి వనం 2022 నాటికి పూర్తి చేస్తాం
 రెండేళ్లలో జగ్జీవన్‌రామ్‌ స్మృతివనం, స్మారక నిర్మాణం పూర్తి
 ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి
 అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్స్‌ మరో 7 జిల్లాలకు విస్తరణ
 ప్రతి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ గ్రంథాలయం ఏర్పాటు
 ఎస్సీలకు 100, ఎస్టీలకు 50 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల కాలపరిమితి 2033 వరకు పొడిగింపు
 ఆదివాసీల అభివృద్ధికి స్త్రీనిది తరహాలో ఆదివాసీ బ్యాంకు ఏర్పాటు
 ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ
 జనాభా దామాషా మేరకు మాదిగల అభ్యున్నతికి నిధుల మంజూరు
 అన్ని వర్గాల పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజు బోధనా రుసుం చెల్లింపు
 వెనుకబడిన తరగతులకు మరో 200 గురుకులాల ఏర్పాటు
 ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లలో బీసీలకు 25శాతం కేటాయింపు
 ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లలో మహిళలకు 33శాతం కేటాయింపు
 కళింగ కోమట్లకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం
 బీసీ ఉప ప్రణాళిక చట్టానికి విధివిధానాలు రూపొందించి అమలు చేస్తాం
 స్వయం ఉపాధిలో భాగంగా కారు రుణాలపై 25 శాతం రాయితీ
 బీసీలకు కార్పొరేషన్ల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు
 ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు 25శాతం రాయితీతో రుణాలు
 ఆధునిక టెక్నాలజీతో షాపులు, షోరూంలు పెట్టుకునే బీసీలకు రూ.5లక్షల సాయం
 వడ్డెర కార్మికుల ఉపాధికి  రాయితీపై జేసీబీ, క్రషర్స్‌ మంజూరు
 పోటీ పరీక్షల శిక్షణకు అమరావతిలో రాష్ట్రస్థాయి బీసీ స్టడీ సర్కిల్‌
 బీసీ విద్యార్థుల వసతి గృహాలకు కొత్త భవనాల నిర్మాణం
 వెనుకబడిన వర్గాలను కులం పేరుతో దూషించడాన్ని నిషేధిస్తాం

చేనేత కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా
 ఆప్కో పెండింగ్‌ బకాయిల విడుదలకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు
 పట్టుదారం కొనుగోలుపై చేనేతకార్మికుల ఖాతాకు నేరుగా రాయితీ నగదు
 ప్రతి చేనేత కుటుంబం ఖాతాలో ఏటా రూ.4వేల జీవన భృతి

కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు
 కాపులకు ప్రకటించిన 5శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు
 వచ్చే ఐదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తాం.
 నిర్మాణంలో ఉన్న కాపు భవనాలన్నీ పూర్తి చేస్తాం.
 కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

ప్రైవేటు దేవాలయాల అర్చకులకు చంద్రన్నబీమా 
 అగ్రవర్ణ పేదలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణ పథకాలు అమలు
 బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు
 అగ్ర కులాల్లోని పేదల చదువు, స్వయం ఉపాధికి ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా సాయం

రెండో భాషగా ఉర్దూ పకడ్బందీగా అమలు 
 ఇమామ్‌లకు రూ.7వేలు, మౌజమ్‌లకు రూ.5వేలు పారితోషికం పెంపు. నగదు నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ.
 ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ

దళిత క్రైస్తువులను ఎస్సీలుగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి 
 ప్రతిజిల్లాలో క్రైస్తవ భవనం నిర్మాణం
 క్రైస్తవుల జెరూసలేం యాత్రకు బడ్జెట్‌ పెంపు
 క్రైస్తవుల శ్మశానాలకు ప్రభుత్వ భూములు కేటాయింపు
 చర్చిలు, క్రైస్తవ ఆస్తులను సర్వే చేయించి హక్కు పత్రాల మంజూరు

మానసిక వికలాంగులకు నెలకు రూ.3వేలు పింఛను
 దివ్యాంగులకు 3 చక్రాల మోటరైజ్డ్‌ సైకిళ్ల పంపిణీ
 వారికి అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు
 దివ్యాంగుల్లో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు గృహ వసతి

క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ
 రూ.10లక్షల లోపు పెట్టుబడితో స్థాపించే పరిశ్రమల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.
 రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌, మెంబర్‌ కాపిటల్‌ ఫండ్‌ ఏర్పాటు
 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీపై రుణాలు

ఏడాదిలో పోలవరం పూర్తి.. 40లక్షల ఎకరాలకు సాగునీరు
 రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి జలభద్రత కల్పించేలా  సంకల్పం
 తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు పుష్కలంగా నీరు
 రెండు కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొస్తాం
 పోలవరం ద్వారా పరిశ్రమలకు 23.44 టీఎంసీలు, విశాఖకు తాగునీరు ఇస్తాం.
 960 మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
 540 గ్రామాల్లో 28.5లక్షల మందికి తాగునీటి వసతి కల్పిస్తాం
 మరో 50లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ వ్యవస్థలు
 2020 నాటికి ప్రతి మనిషికి 70 లీటర్ల నీటి సరఫరా
 జలధార పథకం ద్వారా అన్ని గ్రామాలకు రక్షిత నీటి సరఫరా

అన్ని గ్రామాలకు బీటీ రహదారుల సౌకర్యం
 2వేలు జనాభా దాటిన ఆవాసాల్లో డ్రైనేజీ సౌకర్యం
 అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు
 అన్నిగ్రామ పంచాయతీల్లో అంగన్వాడీ శాశ్వత భవనాలు
  ప్రభుత్వ పాఠశాలలకు మరుగుదొడ్లు, ప్రహరీ, ఆట స్థలాల సౌకర్యం

Friday, April 5, 2019

https://youtu.be/4LAJDiSUpSA

RCB vs KKR
Highlights

#Maharshi Official Teaser Maharshi


ఈ చిత్రం టీజర్‌ను ఉగాది సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఏ డెస్టినేషన్‌.. సక్సెస్‌ ఈజ్‌ ఏ జర్నీ’ అంటూ మహేష్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. ఇందులో మహేష్‌బాబు చాలా స్టైలిష్‌గా కనిపించారు.  ‘‘నాకో ప్రాబ్లమ్‌ ఉంది సర్‌. ఎవడైనా ‘నువ్వు ఓడిపోతావ్‌ అంటే’ గెలిచి చూపించడం నాకు అలవాటు’’ అనే పంచ్‌డైలాగ్‌ అభిమానులకి 
అదిరిపోయె కేక. 48 గంటలకు 15మిలియన్ వ్యూష్. Maharshi Teaser Link Click Here .
https://youtu.be/eQraxc7QbU8


#Tags   #Maharshi   Teaser   Mahesh Babu 
Pooja Hegde  Devisri Prasad Music  Dil Raju 
SMB25  #SMB25 #Mahesh Babu  Maharshi

De de pyar de Ajay Devagan Tabu Rakul Pretty Sing

https://youtu.be/EJUD2PptXrk

PAWAN KALYAN JANASENA అభిమాని అత్యుత్సాహం కింద పడిన పవన్

ఎన్నికల వేళ అభిమానులు, కార్యకర్తల తీరు పార్టీ అధినేతలు, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రోడ్‌షోలో వైకాపా నేత వైఎస్ షర్మిల ఉంగరాన్ని లాక్కెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించగా.. తాజాగా విజయనగరంలో జనసేన బహిరంగ సభలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. వేదికపై పవన్‌ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా..   వెనుక నుంచి వచ్చిన  ఓ అభిమాని పవన్‌ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో ఆయన ఒక్కసారిగా తుళ్లిపడి వేదికపై కింద పడిపోయారు. మైక్‌ కూడా విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆయన్ని పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విజయనగరంలో అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదికపైకి పవన్‌ చేరుకున్న కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది

AP POLITICAL పసుపు కుంకుమ పై హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు - కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ పథకాలు లబ్ధిదారులకు అమలుకాకుండా చూడాలని కోరుతూ జనచైతన్య వేదిక కన్వీనర్‌ లక్ష్మణరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది విన్పించిన వాదనను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ పథకాలు అమలులో ఉన్నందున లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు పంపడం ఈసీ కోడ్‌ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది. అలాగే, ఈ అంశంపై దిల్లీ హైకోర్టులో ఎందుకు పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చిందని అడిగింది. ప్రభుత్వ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రతిసారి ఇలాంటి వాటిని కోర్టుల దృష్టికి తీసుకొచ్చి విలువైన సమాయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది

Thursday, April 4, 2019

IPL Sunrisers Hyderabad Cricket Team

  జట్టు సమష్టిగా రాణిస్తే సారథ్యం వహించడం మరింత సులభమవుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. చివరి రెండు మ్యాచుల్లోనూ పిచ్‌ది ఒకే విధమైన పరిస్థితి. కోట్లాలో బంతిని బాదడం అంత సులువు కాదని తెలుసు. దిల్లీతో మ్యాచ్లో 140 నుంచి 150 పరుగుల లక్ష్యం ఉంటే ఛేదనకు కాస్త శ్రమించాల్సి వస్తుందనుకున్నాం. ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థిని అంతలోపే కట్టడి చేశాం. తర్వాత బ్యాటింగ్‌లో మా బ్యాట్స్‌మెన్‌ బెయిర్‌స్టో అద్భుతంగా ఆడాడు. 28 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు శుభారంభం ఇవ్వడంతో పాటు విజయానికి బాటలు వేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలవడం చాలా కీలక పాత్ర పోషించింది. దిల్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో పిచ్‌ ఎలా స్పందిస్తుందో పరిశీలించాం. అలా చేయడం వల్ల లక్ష్యాన్ని ఛేదించేందుకు మాకు బాగా ఉపయోగపడింది’ అని భువనేశ్వర్‌కుమార్‌ తెలిపాడు

Super Hit Movie : https://youtu.be/Kvlp-8EvbmE

Super Hit Movie : https://youtu.be/Kvlp-8EvbmE

Sunrisers Top

 దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్‌ నెమ్మదిగా ఉండటంతో స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడ్డారు. 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్‌ ఓపెనర్లు బెయిర్‌స్టో(48), డేవిడ్‌వార్నర్‌ (10) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 64 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ విజయానికి బాటలు వేశారు. ఆపై  బెయిర్‌స్టో, వార్నర్‌ వెనువెంటనే ఔట్‌ కాగా విజయ్‌శంకర్(16)‌, మనీశ్‌పాండే(10) సింగిల్స్‌ తీస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వరుసగా మూడు వికెట్లు పడడంతో బ్యాట్స్‌మెన్‌ నెమ్మదించారు. ఆఖర్లో యూసుఫ్‌ పఠాన్‌(9), మహ్మద్‌ నబీ(17) లాంఛనాన్ని పూర్తిచేసి జట్టుని గెలిపించారు.
అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(43) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (23) ఒక ఫోర్‌, రెండు సిక్సులు బాదడంతో దిల్లీ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది

డియర్ కామ్రెడ్

 విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం రష్మిక పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘రేపు(శుక్రవారం) ఉదయం 9గంటలకు మా నుంచి రష్మికకు బర్త్‌డే స్పెషల్‌ వస్తుంది’ అంటూ పేర్కొంటూ ‘హ్యాపీబర్త్‌డే లిల్లీ’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. 
దీనికి రష్మిక స్పందిస్తూ, ‘ఆ సర్‌ప్రైజ్‌ నాకు ఒక్కదానికే తెలుసా? లేదా అందరికీ తెలుసా?నువ్వైనా చెప్పవా ప్లీజ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Rowdy Baby video song Mahesh Babu Samatha

              https://youtu.be/4YFLSsdMqAk