Friday, May 10, 2019

Student Of The Year 2 Review

         Student Of The Year 2 Review 


సంపన్న కుటుంబానికి చెందిన శ్రేయ సుఖాడియా (అనన్య పాండే), డ్యాన్సర్‌ కావాలని కలలు కనే అమ్మాయి మృదుల అలియాస్‌ మియా(తారా సుతారియా) ఒకే కాలేజ్‌లో చదువుతుంటారు. ఆ కాలేజ్‌లో కొత్తగా చేరతాడు రోహన్‌ శర్మ(టైగర్‌ ష్రాఫ్‌). శ్రేయ, మియా.. రోహన్‌ను చూసి ఇష్టపడతారు. అయితే రోహన్‌ దృష్టి మాత్రం కాలేజ్‌లో ఉత్తమ విద్యార్థికి అందించే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ కప్పు పైనే ఉంటుంది. మరి దాన్ని గెలుచుకున్నాడా? శ్రేయ, మియాల్లో ఎవరు రోహన్‌ ప్రేమను గెలుచుకున్నారు? అన్నదే ఈ సినిమా కథ
మొదటి చిత్రంలో ఒక హీరోయిన్‌, ఇద్దరు హీరోలు ఉన్నారు. సీక్వెల్‌లో మాత్రం ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. రెండు సినిమాలకు మధ్య వ్యత్యాసం ఈ ఒక్క పాయింట్‌ మాత్రమేనని చెప్పాలి. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా చూసినవారికి సీక్వెల్‌ చిత్రం అంత గొప్పగా అనిపించదు. సీక్వెల్‌ సినిమా కావడంతో మొదటి సినిమాలో చూపించిన కాలేజ్‌లాంటి భవనాన్నే ఇందులోనూ చూపించారు. అందులోని దాదాపు చాలా సన్నివేశాలను కాపీ కొట్టినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘జో జీతా హై వహీ సికందర్‌’ సినిమాను తలపిస్తాయి. ప్రధమార్ధాన్ని రోహన్‌ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే సన్నివేశాలతో నడిపించాడు దర్శకుడు. అసలు కథ ద్వితీయార్ధంలోనే ఉంటుంది. ప్రేయసి కోసం స్పోర్ట్స్‌ కోటాలో అంతటి పేరున్న కాలేజ్‌లోకి వెళ్లిన రోహన్‌కు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రేమలో విఫలమవుతాడు. కానీ కుంగిపోకుండా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ట్రోఫీని గెలవడానికి అతను చేసిన సాధనలు సినిమాకు బలాన్నిచ్చాయి. విశాల్‌-శేఖర్‌ అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

Tags:  student of the year 2 review  tiger shroff 

No comments:

Post a Comment