Saturday, April 6, 2019

Andhra Pradesh Politics TDP Chandrababu

                 తెలుగుదేశం మేనిఫెస్టో
   మేనిఫెస్టోలో  ముఖ్యమైన హామీలివే.. 
 అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు అమలు. వచ్చే ఖరీఫ్‌ నుంచి కౌలు రైతులకూ ఈ పథకం వర్తింపు.
⇒ వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
 డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కొనసాగింపు
 ఉచితంగా ఉన్నత విద్య
 ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం, అలాగే ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన
 ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షలకు పెంపు
 చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
 పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
 అందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం
 ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం 
రైతులకు 12గంటల పాటు ఉచిత విద్యుత్‌..
 రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
 రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.
 రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెటింగ్‌ వ్యవస్థల బలోపేతం
 ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు 
 రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు
 గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు
 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలు కోటి ఎకరాలకు విస్తరింపు
 మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్ప్రింక్లర్‌  వ్యవస్థలు ఏర్పాటు
 కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు
⇒ వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

చంద్రన్న బీమా రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
  చంద్రన్న భరోసా పింఛన్లు రూ.2వేల నుంచి 3వేలకు పెంపు. 
 నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం. ఇంటర్‌ పాసైతే చాలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 
 ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం.
 వృద్ధాప్య పింఛనుదారుల అర్హతను 65 నుంచి 60ఏళ్లకు  తగ్గింపు
 చంద్రన్న పెళ్లికానుక కింద ఇచ్చే మొత్తం రూ.లక్షకు పెంపు
  20వేల జనాభా దాటిన పంచాయతీలు, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు
 యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తాం.
 కేంద్రంతో పోరాడి వ్యవసాయంతో నరేగా అనుసంధానం
 ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్‌ తీసుకొస్తాం.
 బీసీల్లో చేపల వేటకు వెళ్లే వారిలో క్రాప్‌ హాలిడే కింద రూ.10 వేలకు పెంపు. డీజిల్‌ ప్రోత్సాహకం రూ.10కి పెంపు. 
 పేద కుటుంబాలకు పండుగల నాడు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు
 వర్గీకరణలో పెండింగ్‌లో ఉన్న కులాలకు న్యాయం జరిగేలా చూస్తాం.
⇒ రాజకీయ ప్రాతినిథ్యం లేని వడ్డెర, బ్రాహ్మణ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తాం. 

డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు
 డ్వాక్రా మహిళలకు పసుపు - కుంకుమ పథకం కొనసాగింపు
 మహిళా ఉద్యోగులకు ద్విచక్రవాహనాల కొనుగోలుకు రాయితీలు
 ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో మహిళా వసతి గృహాలు
 చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి
 ఈ ఐదేళ్లలో కోటి మంది మహిళలకు రూ.లక్ష కోట్లు సాయం చేశాం. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సాయాన్ని 2లక్షల కోట్లకు పెంచుతాం.
 వడ్డీ రాయితీ పథకం అర్హత పరిమితి రూ.10లక్షలకు పెంపు
 మహిళా సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు ఉపాధి నైపుణ్య శిక్షణ
 ప్రతి మహిళ కుటుంబ ఆదాయం నెలకు రూ.20వేలు వచ్చేలా పథకాలు

ఏపీని పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
 రాష్ట్రంలో 15,358 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు
  గ్రామీణ ప్రాంతాల్లో మోడల్‌ ప్రీ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య
  ప్రీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం
  గిరిజన ప్రాంతాల గర్భిణులకు హోమ్‌ ఫర్‌ ప్రిగ్నంట్‌ ఉమెన్‌ ఏర్పాటు
 రూ.100 కోట్లతో ఇన్నోవేటివ్‌ ఫండ్‌
 రాజమహేంద్రవరం, ఏలూరు, తిరుపతిని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం.
 మెగా టెక్స్‌టైల్‌ ప్లాంట్లలో 3 లక్షల ఉద్యోగాలు.
 తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ పెద్ద ఎత్తున తీసుకొస్తాం.
 విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌.
 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా కృషి
 ఆరోగ్య పర్యాటకాన్ని (హెల్త్‌ టూరిజం) అభివృద్ధి చేస్తాం. 

విదేశీ విద్యకు ఉపకార వేతనాలు రూ.25లక్షలకు పెంపు
 రైతు పంట ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేలా ఏర్పాటు
 చిన్న ఆక్వా రైతులు, రైతు గ్రూపులకు రాయితీలు, కోల్డ్‌ స్టోరేజీల సౌకర్యం
 తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు అవసరం మేరకు జెట్టీల నిర్మాణం
 ఫిషరీస్‌ యూనివర్సిటీ, ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ స్థాపిస్తాం

ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు 
 రూ.100 కోట్లతో అంబేడ్కర్‌ స్మృతి వనం 2022 నాటికి పూర్తి చేస్తాం
 రెండేళ్లలో జగ్జీవన్‌రామ్‌ స్మృతివనం, స్మారక నిర్మాణం పూర్తి
 ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి
 అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్స్‌ మరో 7 జిల్లాలకు విస్తరణ
 ప్రతి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ గ్రంథాలయం ఏర్పాటు
 ఎస్సీలకు 100, ఎస్టీలకు 50 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల కాలపరిమితి 2033 వరకు పొడిగింపు
 ఆదివాసీల అభివృద్ధికి స్త్రీనిది తరహాలో ఆదివాసీ బ్యాంకు ఏర్పాటు
 ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ
 జనాభా దామాషా మేరకు మాదిగల అభ్యున్నతికి నిధుల మంజూరు
 అన్ని వర్గాల పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజు బోధనా రుసుం చెల్లింపు
 వెనుకబడిన తరగతులకు మరో 200 గురుకులాల ఏర్పాటు
 ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లలో బీసీలకు 25శాతం కేటాయింపు
 ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లలో మహిళలకు 33శాతం కేటాయింపు
 కళింగ కోమట్లకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం
 బీసీ ఉప ప్రణాళిక చట్టానికి విధివిధానాలు రూపొందించి అమలు చేస్తాం
 స్వయం ఉపాధిలో భాగంగా కారు రుణాలపై 25 శాతం రాయితీ
 బీసీలకు కార్పొరేషన్ల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు
 ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు 25శాతం రాయితీతో రుణాలు
 ఆధునిక టెక్నాలజీతో షాపులు, షోరూంలు పెట్టుకునే బీసీలకు రూ.5లక్షల సాయం
 వడ్డెర కార్మికుల ఉపాధికి  రాయితీపై జేసీబీ, క్రషర్స్‌ మంజూరు
 పోటీ పరీక్షల శిక్షణకు అమరావతిలో రాష్ట్రస్థాయి బీసీ స్టడీ సర్కిల్‌
 బీసీ విద్యార్థుల వసతి గృహాలకు కొత్త భవనాల నిర్మాణం
 వెనుకబడిన వర్గాలను కులం పేరుతో దూషించడాన్ని నిషేధిస్తాం

చేనేత కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా
 ఆప్కో పెండింగ్‌ బకాయిల విడుదలకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు
 పట్టుదారం కొనుగోలుపై చేనేతకార్మికుల ఖాతాకు నేరుగా రాయితీ నగదు
 ప్రతి చేనేత కుటుంబం ఖాతాలో ఏటా రూ.4వేల జీవన భృతి

కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు
 కాపులకు ప్రకటించిన 5శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు
 వచ్చే ఐదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తాం.
 నిర్మాణంలో ఉన్న కాపు భవనాలన్నీ పూర్తి చేస్తాం.
 కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

ప్రైవేటు దేవాలయాల అర్చకులకు చంద్రన్నబీమా 
 అగ్రవర్ణ పేదలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణ పథకాలు అమలు
 బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు
 అగ్ర కులాల్లోని పేదల చదువు, స్వయం ఉపాధికి ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా సాయం

రెండో భాషగా ఉర్దూ పకడ్బందీగా అమలు 
 ఇమామ్‌లకు రూ.7వేలు, మౌజమ్‌లకు రూ.5వేలు పారితోషికం పెంపు. నగదు నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ.
 ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ

దళిత క్రైస్తువులను ఎస్సీలుగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి 
 ప్రతిజిల్లాలో క్రైస్తవ భవనం నిర్మాణం
 క్రైస్తవుల జెరూసలేం యాత్రకు బడ్జెట్‌ పెంపు
 క్రైస్తవుల శ్మశానాలకు ప్రభుత్వ భూములు కేటాయింపు
 చర్చిలు, క్రైస్తవ ఆస్తులను సర్వే చేయించి హక్కు పత్రాల మంజూరు

మానసిక వికలాంగులకు నెలకు రూ.3వేలు పింఛను
 దివ్యాంగులకు 3 చక్రాల మోటరైజ్డ్‌ సైకిళ్ల పంపిణీ
 వారికి అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు
 దివ్యాంగుల్లో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు గృహ వసతి

క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ
 రూ.10లక్షల లోపు పెట్టుబడితో స్థాపించే పరిశ్రమల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.
 రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌, మెంబర్‌ కాపిటల్‌ ఫండ్‌ ఏర్పాటు
 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీపై రుణాలు

ఏడాదిలో పోలవరం పూర్తి.. 40లక్షల ఎకరాలకు సాగునీరు
 రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి జలభద్రత కల్పించేలా  సంకల్పం
 తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు పుష్కలంగా నీరు
 రెండు కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొస్తాం
 పోలవరం ద్వారా పరిశ్రమలకు 23.44 టీఎంసీలు, విశాఖకు తాగునీరు ఇస్తాం.
 960 మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
 540 గ్రామాల్లో 28.5లక్షల మందికి తాగునీటి వసతి కల్పిస్తాం
 మరో 50లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ వ్యవస్థలు
 2020 నాటికి ప్రతి మనిషికి 70 లీటర్ల నీటి సరఫరా
 జలధార పథకం ద్వారా అన్ని గ్రామాలకు రక్షిత నీటి సరఫరా

అన్ని గ్రామాలకు బీటీ రహదారుల సౌకర్యం
 2వేలు జనాభా దాటిన ఆవాసాల్లో డ్రైనేజీ సౌకర్యం
 అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు
 అన్నిగ్రామ పంచాయతీల్లో అంగన్వాడీ శాశ్వత భవనాలు
  ప్రభుత్వ పాఠశాలలకు మరుగుదొడ్లు, ప్రహరీ, ఆట స్థలాల సౌకర్యం

No comments:

Post a Comment