Friday, April 5, 2019

AP POLITICAL పసుపు కుంకుమ పై హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు - కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ పథకాలు లబ్ధిదారులకు అమలుకాకుండా చూడాలని కోరుతూ జనచైతన్య వేదిక కన్వీనర్‌ లక్ష్మణరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది విన్పించిన వాదనను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ పథకాలు అమలులో ఉన్నందున లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు పంపడం ఈసీ కోడ్‌ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది. అలాగే, ఈ అంశంపై దిల్లీ హైకోర్టులో ఎందుకు పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చిందని అడిగింది. ప్రభుత్వ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రతిసారి ఇలాంటి వాటిని కోర్టుల దృష్టికి తీసుకొచ్చి విలువైన సమాయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది

No comments:

Post a Comment