కింగ్స్ XI పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కెప్టెన్ విరాట్‌కోహ్లీ(67, 53 బంతుల్లో 8x4), డివిలియర్స్ (59, 38 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలతో చెలరేగడంతో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టు స్కోర్ 43 పరుగుల వద్ద పార్థివ్ పటేల్(19) ఔటకాగా డివిలియర్స్, కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 85 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లీ ఔటయ్యాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్(28, 16 బంతుల్లో 4x4), డివిలియర్స్ ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తిచేశారు.
Tags ipl t20 cricket rcb kxip dc mi
csk srh rr kkr

No comments:
Post a Comment