Wednesday, April 10, 2019


         Mumbai Indians Excellent Wining


పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీరన్‌ పొలార్డ్‌ (83, 31 బంతుల్లో 10x6, 3x4) విధ్వంసం ముందు భారీ లక్ష్యం చిన్నబోయింది. ఆకాశమే హద్దుగా పొలార్డ్‌ చేలరేగడంతో ప్రేక్షకులకు పసందైన విందు లభించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. చప్పగా సాగుతున్న మ్యాచ్‌ను తన అద్భుత ఆటతో ఒక్కసారిగా మలుపు తిప్పిన కీరన్‌ పొలార్డ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. పంజాబ్‌ జట్టులో మహ్మద్‌ షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు తీశాడు. 
అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ XI పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(100 నాటౌట్‌, 64 బంతుల్లో 6x4, 6x6), క్రిస్‌గేల్‌(63, 36 బంతుల్లో 3x4, 7x6) చెలరేగి ఆడడంతో పంజాబ్‌కు మంచి శుభారంభం దొరికింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గేల్‌ అర్ధశతకం సాధించాక 13వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఆపై పంజాబ్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో స్కోర్‌ కాస్త నెమ్మదించింది. అయితే చివరి మూడు ఓవర్లలో కేఎల్‌ రాహుల్‌ విజృంభించి ఆడి శతకం సాధించాడు
        
        Match highlights click




Tags   Ipl t20  cricket  kkr srh rr csk  dc 
rcb mi kxlp highlights 

No comments:

Post a Comment