Friday, April 26, 2019

Avengers End Game Review Action Movie

          Avengers End Game Review 

Movie  అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌
Star Cast  రాబర్ట్‌ డౌనీ జూనియర్‌.. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌.. మార్క్‌ రఫెలో.. క్రిస్‌ ఇవాన్స్‌.. స్కార్లెట్‌ జొహాన్సన్‌.. టామ్‌ హొలాండ్‌.. విన్‌ డీసిల్‌.. క్రిస్‌ ప్రాట్‌ తదితరులు
Music అలెన్‌ సిల్వస్ట్రీ
Cinematography  ట్రెంట్‌ ఆప్లాచ్‌
Editor జెఫ్రీ ఫోర్డ్‌, మాథ్యూస్‌
Producer కెవిన్‌ ఫిజీ
Director  ఆంటోని రుస్సో.. జో రుస్సో..
Production మార్వెల్‌ స్టూడియోస్‌
Date 26-04-2019
ఇప్పటివరకూ హాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హీరో చిత్రాలు వచ్చాయి. ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న దుష్టశక్తులపై ఆ సూపర్‌ హీరోలందరూ తమదైన శైలిలో పోరాడి ప్రేక్షకులతో ఔరా! అనిపించారు. ఈ విశ్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అందుకోసం అత్యంత శక్తివంతమైన ఆరు ఇన్ఫినీటీ స్టోన్స్‌ను సంపాదిస్తాడు థానోస్‌. అతన్ని ఎదుర్కొవడానికి ‘అవెంజర్స్‌’ బృందం యత్నించి ఓడిపోతుంది. కొందరు సూపర్‌హీరోలు అదృశ్యమైపోతారు. గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా, అదృశ్యమైన కొందరు సూపర్‌హీరోలు ఎలా తిరిగి వచ్చారు?  మిగిలిన వారితో కలిసి థానోస్‌ను ఎలా ఎదుర్కొన్నారు? అని చెప్పే చిత్రమే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’. విడుదలకు ముందే బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
     థానోస్‌ శక్తివంతమైన ఇన్ఫినిటీ స్టోన్స్‌తో సగానికిపైగా ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అదే సమయంలో కెప్టెన్‌ మార్వెల్‌ నెబులాను, అంతరిక్షంలో చిక్కుకుపోయిన టోనీ స్టార్క్‌ను కాపాడుతుంది. వారు భూమిపైకి చేరుకుని బ్లాక్‌విడో, హల్క్, కెప్టెన్‌ అమెరికా, రాకెట్‌, థార్‌ తదితరుల బృందాన్ని కలుస్తుంది. థానోస్‌ చేతిలో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తీసుకుని, అతని చర్యలు అడ్డుకట్టవేయాలని భావిస్తారు. థానోస్‌ దగ్గరకు వెళ్లిన అవెంజర్స్‌ ఆశ్చర్యపోతారు. ఆ స్టోన్స్‌ను ఎవరూ వాడకూడదనే ఉద్దేశంతో నాశనం చేసినట్లు చెబుతాడు. దీంతో కోపంతో థార్‌.. థానోస్‌ తలను నరికేస్తాడు. అయితే, కాలంలో ప్రయాణించి ఆ రాళ్లను సంపాదిస్తే, థానోస్‌ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకురావచ్చని అవెంజర్స్‌ భావిస్తారు. అందుకు వారు ఏడు గ్రూప్‌లుగా విడిపోతారు. మరి అలా విడిపోయిన అవెంజర్స్‌ ఆ స్టోన్స్‌ను సంపాదించారా? థానోస్‌ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకొచ్చారా? తల నరికినా థానోస్‌ ఎలా బతికాడు? చివరకు అతన్ని అవెంజర్స్‌ ఎలా అంతం చేశారు? అన్నదే ‘ఎండ్‌గేమ్‌’ కథ.
          ‘అవెంజర్స్‌ఇన్ఫినిటీవార్‌’కు ఇది కొనసాగింపు అని చెప్పాలి. అందులో చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. వాటన్నింటికీ ఇందులో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు దర్శకులు రుస్సో బ్రదర్స్‌. అందుకు తగినట్టుగానే సన్నివేశాలను రాసుకున్నారు. అదృశ్యమైన సూపర్‌హీరోలు కలవడం.. థానోస్‌ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తిరిగి సంపాదించడం ద్వారా అతని చర్యలకు అడ్డుకట్టవేయాలని చూడటం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే, ఎప్పుడైతే అతను వాటిని నాశనం చేసినట్లు చెబుతాడో.. సూపర్‌హీరోలు వాటిని ఎలా తిరిగి తెస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. 
వారంతా కాలంలో ప్రయాణించి గతంలోకి వెళ్లడం, అక్కడ జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హల్క్‌, రాకెట్‌లతో నవ్వులు పంచే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. సినిమా దాదాపు 3గంటల పాటు సాగుతుంది. రుస్సో బ్రదర్స్‌ తాము అనుకున్న చాలా సన్నివేశాలను అలాగే చూపించాలనుకున్నారు. అందుకే ప్రథమార్ధంలో చాలా సన్నివేశాల్లో కాస్త సాగదీత కనిపిస్తుంది. ఆయా సన్నివేశాలకు కత్తెర వేస్తే ఇంకాస్త బాగుండేది. ఆ ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సంపాదించిన తర్వాత అవెంజర్స్‌ బృందం థానోస్‌ను ఎలా ఎదుర్కొందో ద్వితీయార్ధంలో చక్కగా చూపించారు దర్శకులు. అద్భుతమై యాక్షన్‌ సన్నివేశాలకు తోడు, భావోద్వేగ సన్నివేశాలో ప్రేక్షకులను కట్టిపడేశారు. అవెంజర్స్‌ అభిమానులను క్లైమాక్స్‌ కంటతడి పెట్టిస్తుంది


Tags: AVENGERS END GAME  HOLLYWOOD MOVIE  REVIEW TELUGU  SUPER HERO'S 

No comments:

Post a Comment