Sunday, April 21, 2019

Best Finisher Dhoni Excellent batting

            ఉత్కంఠగా సాగిన ధోని బ్యాటింగ్ 

నిన్న జరిగిన బెంగుళూరు చేన్నై మధ్య ఐపిఎల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగిన ధోని బ్యాటింగ్ .6 బంతుల్లో 26 పరుగులు.. ఎలాంటి బ్యాట్స్‌మన్‌కైనా ఈ సమీకరణం కష్ట సాధ్యమే! ఒకప్పటి ధోని మీద అయితే ఆశలు పెట్టుకోవచ్చు కానీ.. ఈ మధ్య అతడిలో మునుపటి ఊపు కనిపించని నేపథ్యంలో ఛేదన అసాధ్యం లాగే అనిపించింది! కానీ ధోని అనూహ్య రీతిలో చెలరేగిపోయాడు. చెన్నైని విజయపుటంచుల దాకా తీసుకెళ్లాడు. ఇక చెన్నై గెలుపు లాంఛనమే అనుకునేలా చేశాడు. కానీ ఆఖరి బంతికి ఊహించనిది జరిగింది. మ్యాచ్‌ బెంగళూరు వశమైంది. ఓవర్‌ తొలి బంతికి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టిన ధోని.. రెండో బంతిని పుల్‌ చేస్తూ మిడ్‌వికెట్‌ దిశగా స్టేడియం అవతల పడేలా కొట్టడం విశేషం. బంతి ఏకంగా 111 మీటర్లు ప్రయాణించిందంటే ధోని ఎంత బలంగా, కసిగా ఆ బంతిని కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్‌తో ధోని ఆత్మవిశ్వాసం రెట్టింపై.. తర్వాతి బంతికి కూడా సిక్సర్‌ అందుకున్నాడు. ఈసారి లాంగాఫ్‌లో బంతి బౌండరీ దాటింది. నాలుగో బంతికి రెండు పరుగులు రావడంతో చివరి 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఉమేశ్‌ ఓ చెత్త బంతి వేశాడు. యార్కర్‌ కోసం ప్రయత్నించాడో ఏమో కానీ.. అది ధోని కాళ్ల మీదికి పుల్‌టాస్‌లా వచ్చింది. అతను అలవోకగా మిడ్‌వికెట్‌, స్క్వేర్‌ లెగ్‌ మధ్యలో సిక్సర్‌ బాదేశాడు. ఒక బంతికి 2 పరుగులు చేస్తే చాలు. 5 బంతుల్లో 24 పరుగులు చేసిన వాడికి ఇదో లెక్కా? ఇంకేముంది చెన్నై విజయం లాంఛనమే అనిపించింది. కానీ మధ్యలో డివిలియర్స్‌తో మంతనాలు జరిపిన ఉమేశ్‌.. ఈసారి వేగం తగ్గించి ఆఫ్‌ స్టంప్‌ ఆవల లెంగ్త్‌ బాల్‌ వేశాడు. ధోని దాన్ని పాయింట్‌ వైపు కట్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. పరుగు తీసే ప్రయత్నం చేశాడు. వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ బంతిని అందుకుని వికెట్లకు డైరెక్ట్‌ త్రో వేసేశాడు. అవతలి ఎండ్‌ నుంచి వచ్చిన శార్దూల్‌.. డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది. స్వల్ప తేడాలో అతను రనౌటైపోయాడు. పరుగు పూర్తయితే మ్యాచ్‌ టై అయ్యేది. సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చేది.ధోని కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే.
Tags: IPL T20 CRICKET  RCB VS CSK  DHONI  VIRAT KOHLI 

No comments:

Post a Comment