Prabhas Comment Shahid
Kabir Singh
బాహుబలి’తో అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ చూశారట. ఈ విషయాన్ని ఆయన హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చెప్పారు. ప్రభాస్ ఫోన్‌లో దాదాపు ఏడు నిమిషాలు షాహిద్‌తో మాట్లాడారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘‘సాహో’ సినిమా షూటింగ్ కోసం నేను ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నా. ‘కబీర్ సింగ్’ టీజర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రభాస్ దాన్ని చూసి.. నచ్చిందని చెప్పారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రభాస్ టీం మెంబర్స్ కూడా షాహిద్ నటనను మెచ్చుకున్నారు. టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ రియాక్షన్ చూసి.. నేను షాహిద్‌కు ఫోన్ చేసి, ఆయన చేతిలో పెట్టా. ప్రభాస్ షాహిద్‌ను ప్రశంసించారు. ఒరిజినల్ కంటే ‘కబీర్ సింగ్’ ఇంకా ఉత్తమంగా ఉందని అన్నారు. దాదాపు ఏడు నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారు’ అని తెలిపారు.
Tags: Kabir Singh Hindi Movie Shahid Kapoor Kiara Advani


No comments:
Post a Comment