Monday, April 15, 2019

IPL T20 RCB vs MI

     బెంగుళూరు పై ముంబాయి ఘనవిజయం 
ఏబీ డివిలియర్స్‌ (75; 51 బంతుల్లో 6×4, 4×6)కు తోడుగా మొయిన్‌ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) సమయోచిత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ముంబయి ఇండియన్స్‌కు 172 పరుగుల లక్ష్యం నిర్దేశించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. పార్థివ్‌ పటేల్‌ (28; 20 బంతుల్లో 4×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. విరాట్‌ కోహ్లీ (8) విఫలమయ్యాడు. ఏబీడీ ఆటతో బెంగళూరు 190 పరుగులు చేసేలా కనిపించింది. అయితే మలింగ వేసిన ఆఖరి ఓవర్లో డివిలియర్స్‌, అక్షదీప్‌ నాథ్‌ (0), పవన్‌ నేగి (0) వరుసగా ఔట్‌ కావడంతో కోహ్లీసేన 171/7కు పరిమితమైంది
బెంగళూరుకు ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని రోహిత్‌ సేన సునాయాసంగా ఛేదించింది. మరో 6 బంతులు, 5 వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది. ఛేదనలో ఓపెనర్లు డికాక్‌ (40; 26 బంతుల్లో 5×4, 2×6), రోహిత్‌ శర్మ (28; 19 బంతుల్లో 2×4, 2×6) శుభారంభం అందించారు. 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఒకే ఓవర్‌లో పరుగు వ్యవధిలో వెనుదిరిగినా ఇషాన్‌ కిషన్‌ (21; 9 బంతుల్లో 3×6), సూర్యకుమార్‌  యాదవ్‌ (29; 23 బంతుల్లో 2×4, 1×6) మెరుపులు మెరిపించారు. 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైన దశలో హార్దిక్‌ పాండ్య (37; 16 బంతుల్లో 5×4, 2×6) విరుచుకుపడ్డాడు. నేగీ వేసిన 19 ఓవర్‌లో 0, 6, 4, 4, 6, వైడ్‌1తో విజయం అందించాడు.ముంబాయి ఇండియన్స్ 
పాయింట్లు పట్టికలో మూడో స్థానాంలోకి చేరింది .



Tags:   ipl t20 cricket   mi  rcb  csk  srh 
 kkr   rr  kxip   dc  cricket 

No comments:

Post a Comment