Saturday, April 20, 2019

IPL T20 CRICKET MI vs RR AND DC vs KXIP

                         MI vs RR 


రాజస్థాన్‌ సత్తా చాటింది స్టీవ్‌ స్మిత్‌ (59 నాటౌట్‌; 48 బంతుల్లో 5×4, 1×6) తొలిసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన వేళ రాయల్స్‌ శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులే చేసింది. డికాక్‌ (65; 47 బంతుల్లో 6×4, 2×6) టాప్‌ స్కోరర్‌. స్మిత్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (43; 29 బంతుల్లో 5×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడడంతో రాయల్స్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.10 మ్యాచ్ ల్లో 4మ్యాచ్ ఓడిపోయి 12పాయింట్లు సాధించింది. 

DC vs KXIP 
బౌలర్లు సందీప్‌ లమిచానె (3/40), కాగిసో రబాడ (2/23), అక్షర్‌ పటేల్‌ (2/22).. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ (56; 41 బంతుల్లో 7×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటడంతో ఐపీఎల్‌-12లో దిల్లీ మరో విజయం సాధించింది. ఆ జట్టు 5 వికెట్ల తేడాతో  పంజాబ్‌పై నెగ్గింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (69; 37 బంతుల్లో 6×4, 5×6) మెరుపులు మెరిపించినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌కు దిల్లీ బౌలర్లు కళ్లెం వేశారు. అనంతరం దిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది
ఢిల్లీ 10మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయి 12పాయింట్లు సాధించింది .
Tags:   IPL T20 CRICKET  MI KXIP 
RR RCB SRH DC CSK KKR 


No comments:

Post a Comment