Friday, April 19, 2019

RCB vs KKR IPL T20 CRICKET

           ఉత్కంఠభరితమైన పోరులో

               బెంగుళూరు విజయం 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి కోల్‌కతా ముందు భారీ టార్గెట్‌ నిర్దేశించింది. కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ(100, 58 బంతుల్లో 9x4, 4x6) శతకంతో అదరగొట్టగా మొయిన్‌ అలీ(66, 28 బంతుల్లో 5x4, 6x6) అర్ధశతకంతో చెలరేగాడు. మొదట పార్థివ్‌పటేల్‌(11), అక్ష్‌దీప్‌నాథ్‌ (13) తక్కువ పరుగులకే ఔటైనా కోహ్లీ, అలీ మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించి స్కోర్‌ బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అలీ ఔటయ్యాక కోహ్లీ దూకుడుగా ఆడి శతకం సాధించాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు తెరపడింది    

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 24 పరుగులు అవసరం కాగా అప్పటికే భీకర ఫామ్‌లో ఉన్న రసెల్‌(65, 25 బంతుల్లో 2x4, 9x6) బెంగళూరుకు వణుకు పుట్టించాడు. చివరి ఓవర్‌ వేసిన మొయిన్‌ అలీ కేవలం 13 పరుగులే ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. మొదటి ఓవర్‌ నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆపై నితీశ్‌రాణా(85, 46 బంతుల్లో 9x4, 5x6), రాబిన్‌ ఉతప్ప కాసేపు పోరాడినా విజయం వైపు సాగలేదు. దీంతో ఉతప్ప ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రసెల్‌ కోల్‌కతాను గెలిపించినంత పని చేశాడు. చివరి ఓవర్‌లో మొయిన్‌అలీ కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరుకు విజయాన్ని అందించాడు
Tags   IPL T20 CRICKET KKR  RCB 

No comments:

Post a Comment