Wednesday, April 17, 2019

  F35  అదృశ్యమైపోయింది
ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ ఉదయం సాధనలో భాగంగా జపాన్‌లోని మిసవా బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరిన విమానం ఎఫ్‌35ఏ అరగంటలోపే రాడార్‌ నుంచి అదృశ్యమైపోయింది. దీంతో విమానం పసిఫిక్‌ సముద్రంలో కూలిపోయినట్లు జపాన్‌ అధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో ఒక్కసారిగా అమెరికా, జపాన్‌లు అప్రమత్తమైపోయాయి. ఈ విమానం జపాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలోని జలాల్లోనే కూలిపోయినట్లు అనుమానించారు. కొద్ది గంటల్లోనే విమాన శకలాలను గుర్తించామని జపాన్‌ సైన్యం ప్రకటించినా కీలక భాగాలు మాత్రం ఇంకా వారి చేతికి అందలేదు


ఎఫ్‌35 విమానాల అభివృద్ధి అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా పేరుతెచ్చుకొంది. దాదాపు 200 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో ప్రారంభమై ఈ ప్రాజెక్టు చివరకు 1.5ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. అంటే అక్షరాలా రూ.104 లక్షల కోట్లన్నమాట. ఒక్కో విమానం ఖరీదు 90 మిలియన్‌ డాలర్ల నుంచి 100 మిలియన్‌ డాలర్ల మధ్యలో ఉంటుంది.  ఇప్పుడు ఆ విమానం చైనా, రష్యా నౌకలు తరచూ సంచరించే సముద్రజలాల్లో కూలిపోవడం అమెరికాకు నిద్రపట్టనివ్వడంలేదు. 

No comments:

Post a Comment